మిస్ వరల్డ్ టెక్నాలజీతో అమ్మగా మారింది

By Hazarath
|

మిస్ వరల్డ్ డయానా తల్లి అయింది. అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా..అయితే ఆమె తల్లి అప్పటికప్పుడు కాలేదు. దాదాపు 8 ఏళ్ల క్రితం దాచిపెట్టుకున్న అండాల ద్వారా ఆమె ఇప్పుడు తల్లి అయ్యే అదృష్టాన్ని దక్కించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ పద్ధతి అయిన ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ పద్దతిపై అనేక మంది ఆసక్తి చూపిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్

మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్

మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్ (42) ఓ పాపకు జన్మనిచ్చింది. వైద్యశాస్త్రంలో నూతన పద్దతి అయిన ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో డయానా ఆ పాపకు జన్మనివ్వడం విశేషం.

ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో

ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో

ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో దాచిన తన అండాలతో డయానా తల్లి కావడం ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పై ఆసక్తి రేకెత్తిస్తోంది.

పలువురు సెలబ్రెటీ మహిళలను
 

పలువురు సెలబ్రెటీ మహిళలను

పలువురు సెలబ్రెటీ మహిళలను డయానా ముందుచూపు ఆలోచింపజేస్తుంది. సాధారణంగా కెరీరా, కుటుంబమా అనే ప్రశ్న సెలబ్రిటీలకే కాకుండా చాలా మంది మహిళలకు ఎదురౌతుంది. రెండూ ప్రాముఖ్యత గల అంశాలే. ఎటూ తేల్చుకోలేని సందిగ్థం.

ముందు జాగ్రత్తగా కొన్ని అండాలను

ముందు జాగ్రత్తగా కొన్ని అండాలను

ఈ పరిస్థితే డయానాకు ఎదురైంది. అసలే అందాల పోటీ ప్రపంచం. మధ్యలో పిల్లలు, పెళ్లి అంటూ విరామం ఇస్తే తరువాత భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్న డయానా ముందు జాగ్రత్తగా కొన్ని అండాలను ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు సహాయంతో ఎనిమిదేళ్ల క్రితం నిలువ ఉంచింది.

రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన కోలిన్ డిక్ ను

రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన కోలిన్ డిక్ ను

రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన కోలిన్ డిక్ ను ప్రేమించి పెళ్లాడిన డయానా ఇప్పుడు ఎండో మెట్రియోసిస్ అనే వ్యాధితో బాధ పడుతోంది.

ఈ వ్యాధి కారణంగా ఆరోగ్యవంతమైన అండాలను

ఈ వ్యాధి కారణంగా ఆరోగ్యవంతమైన అండాలను

ఈ వ్యాధి కారణంగా ఆరోగ్యవంతమైన అండాలను విడుదల చేయలేని స్థితిలో ఉన్న డయానా తాను ముందు జాగ్రత్తగా దాచిన అండాల సహాయంతో టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు తల్లయింది.

నేను మొదటి సారిగా 2005 లో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి

నేను మొదటి సారిగా 2005 లో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి

దీనిపై డయానా మాట్లాడుతూ .. 'నేను మొదటి సారిగా 2005 లో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్నాను. అప్పుడు నా కెరీర్ మంచి స్థితిలో ఉంది. అదీకాక నేను ప్రేమలో పడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు

కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు

కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు మహిళలు తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు 'అని తెలిపింది.

ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన ఆర్యా హెడెన్

ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన ఆర్యా హెడెన్

ఇండియాలో సరాసరి నవజాత శిశువు బరువు 2.6 కేజీలు, పొడవు 48 సెంటీమీటర్లు కాగా ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన ఆర్యా హెడెన్ కిలోల బరువు 3.7, 55 సెంటీమీటర్ల పొడవు ఉండటం విశేషం.

Best Mobiles in India

English summary
Here Write Ex Miss World gives birth from egg frozen Technology for 8 years

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X