ఆఫీస్‌లో ఫేస్‌బుక్ ఎవరికీ తెలియకుండా ఉపయోగించాలంటే.. ఎలా?

Posted By: Super

ఆఫీస్‌లో ఫేస్‌బుక్ ఎవరికీ తెలియకుండా ఉపయోగించాలంటే.. ఎలా?

ఫేస్‌బుక్ ప్రస్తుతం ప్రపంచంలో అతి వేగవంతంగా అభివృద్ది చెందుతున్న సామాజిక వెబ్‌సైట్. దీని ద్వారా మన స్నేహితులను మిత్రులను అందరిని కలుసుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. సాధారణంగా ఇంట్లో ఇంటర్నెట్ ఉండే వారికి ఫేస్‌బుక్‌ని వాడడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ శాతం మంది ఆఫీస్‌లలో ఉండడం జరుగుతుంది. అలాంటి వారు ఆఫీస్‌లో ఫేస్‌బుక్‌ని ఎవరికి తెలియకుండా వాడాలంటే ఏమిచేయాలి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా చిన్న డెస్క్ టాప్ అప్లికేషన్‌ని మీ కంప్యూటర్‌లోకి డౌన్ లోడ్ చేసుకోవడమే.

ఆఫీస్‌లో మనం ఫేస్‌బుక్ చూస్తున్నామని ఎవరికీ తెలియకుండా ఉండటానికి Excel Book అనే డెస్క్ టాప్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. Excel Book చూడటానికి Excel Spread Sheet లా ఉంటుంది అయినప్పటికీ మనం ఫేస్‌బుక్ చేసే పనులన్నీ ఇక్కడ చెయ్యవచ్చు. అయితే ఫేస్‌బుక్ వాడుతున్నా చూసే వారికి మాత్రం Excel లో ఏదో పని చేస్తున్నామని అనుకుంటారు. Excel Book ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ చెయ్యాలి. ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఇన్ఫర్మేషన్‌ మొత్తాన్ని మనం ఇక్కడకు తెచ్చుకోవాలి. సో మరి ఇంకెందుకు ఆలస్యం ఆఫీస్‌లో మీ బాస్ కళ్శు గప్పి ఫేస్‌బుక్ వాడాలంటే Excel Bookని డౌన్ లోడ్ చేసుకోని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot