2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...

|

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP). ఈ సంస్థ ఇండియాలో 1998 నుండి తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. ఇది తన యొక్క వినియోగదారులకు కేవలం నాలుగు ప్లాన్‌లను మాత్రమే అందిస్తుంది. వీటిలో రెండు ప్లాన్‌లు ఒకే రకమైన వేగంతో వస్తాయి కాని విభిన్న ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటా పరిమితులను కలిగి ఉన్నాయి.

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు 60 Mbps, 100 Mbps మరియు 150 Mbps వంటి మూడు విభిన్న వేగాలతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ లేదా జియోఫైబర్ వంటి సేవలకు బిన్నంగా ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్‌ తన యొక్క ప్లాన్‌లను వివిధ అందుబాటు ధరలో అనేక ప్రయోజనాలతో లభిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌లు

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌లు

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ తన యొక్క వినియోగదారులకు 'స్మార్ట్', 'ఎసెన్షియల్', 'అల్టిమేట్' మరియు 'ప్రిఫరడ్ ' వంటి నాలుగు ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో మొదటి రెండు ప్లాన్‌లైన 'స్మార్ట్' మరియు 'ఎసెన్షియల్' వినియోగదారులకు 60Mbps వేగంతో లభిస్తాయి. మిగతా రెండు ప్లాన్‌లైన 'అల్టిమేట్' మరియు 'ప్రిఫరెడ్' వరుసగా 100Mbps మరియు 150Mbps వేగంతో లభిస్తాయి.

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌ల ధరలు

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌ల ధరలు

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ యొక్క 'స్మార్ట్' ప్లాన్ మరియు 'ఎసెన్షియల్' ప్లాన్ మధ్య ప్రధాన వ్యత్యాసం వారు అందించే FUP డేటా మొత్తం. 'స్మార్ట్' ప్లాన్ వినియోగదారులకు 400GB డేటాను అందించగా, 'ఎసెన్షియల్' ప్లాన్ 800GB డేటాను అందిస్తుంది. FUP డేటాను వినియోగించిన తర్వాత రెండు ప్లాన్‌లలో ఇంటర్నెట్ స్పీడ్ 1 Mbps కి పడిపోతుంది. 'స్మార్ట్' ప్లాన్ యొక్క నెలవారీ ధర రూ.499 కాగా 'ఎసెన్షియల్' ప్లాన్ యొక్క ధర రూ.599. అలాగే 'అల్టిమేట్' ప్లాన్ వినియోగదారులకు 100Mbps వేగంతో 1,500GB FUP డేటాతో వస్తుంది. FUP డేటా వినియోగం తరువాత ఇంటర్నెట్ వేగం 2 Mbps కి పడిపోతుంది. 'అల్టిమేట్' ప్లాన్ యొక్క నెలవారీ ధర రూ.799. చివరగా ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ నుండి అత్యంత ఖరీదైన మరియు ఉత్తమమైన సమర్పణ 'ప్రిఫరెడ్' ప్లాన్. ఈ ప్లాన్ యొక్క నెలవారీ ధర 1,199 రూపాయలు. ఇది 3,000GB FUP డేటాతో వినియోగదారులకు 150 Mbps వేగంతో అందిస్తుంది. FUP డేటాను వినియోగించిన తర్వాత ఈ ప్లాన్ ఇంటర్నెట్ వేగాన్ని 2 Mbps కు తగ్గిస్తుంది.

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ దీర్ఘకాలిక ఉచిత ఆఫర్

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ దీర్ఘకాలిక ఉచిత ఆఫర్

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు సంస్థ యొక్క ప్లాన్ లను సెమీ-వార్షిక (6 నెలలు) లేదా వార్షిక (12 నెలల) చెల్లుబాటు కాలానికి ఎంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. నాలుగు ప్లాన్‌లు దీర్ఘకాలిక చెల్లుబాటుతో అందుబాటులో ఉన్నాయి. 6 నెలల చెల్లుబాటుతో కొనుగోలు చేసిన ఏదైనా ప్లాన్ వినియోగదారులకు 1 నెలపాటు సేవలను ఉచితంగా పొందడంతో పాటుగా 100Gb బోనస్ డేటాను కూడా పొందుతారు. ఇంకా 12 నెలలు చెల్లుబాటు కాలానికి ఏదైనా ప్లాన్ ను ఎంచుకుంటే వారికి 2 నెలల పాటు సేవలు ఉచితంగా పొందడంతో పాటుగా 100GB బోనస్ డేటాను కూడా పొందుతారు. 100GB బోనస్ డేటా ప్రతి నెల ప్రణాళిక యొక్క FUP పరిమితి పైన చేర్చబడుతుంది.

బ్రాడ్‌బ్యాండ్

ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు వారి డేటా వినియోగ సరళిని అర్థం చేసుకోవడానికి డేటా వినియోగ విశ్లేషణల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తుంది. అలాగే వినియోగదారులు కనెక్షన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు ఉచిత వై-ఫై రౌటర్‌ను కూడా పొందుతారు. కానీ ఉచిత ఇన్‌స్టాలేషన్ మరియు ఉచిత రౌటర్ లభ్యతకు లోబడి ఉంటుందని కంపెనీ తెలిపింది.


ఏదేమైనా మీరు మీ స్వంతంగా కనెక్షన్ కోసం రౌటర్ పొందాలని ఆలోచిస్తుంటే మీరు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై రౌటర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇంటర్నెట్ యొక్క మరింత సౌకర్యవంతమైన ఉపయోగం కోసం 2.4 GHz మరియు 5 GHz డ్యూయల్ ఛానెల్స్ తో కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుండి యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోగల యాప్‌ను కూడా కంపెనీ అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Excell Broadband Long-Term Plans Offering 2 Months Free Internet Services

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X