Excitel బ్రాడ్‌బ్యాండ్ లాంగ్-టర్మ్ హై-స్పీడ్ ప్లాన్‌లను నెలకు రూ.499 మాత్రమే...
ఇండియాలో సుమారు 13 నగరాల్లో ప్రస్తుతం తన యొక్క సేవలను అందిస్తున్న ఎక్సిటెల్ బ్రాడ్‌బ్యాండ్ తన ప్రత్యర్థి ఆపరేటర్లైన జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ACT ఫైబర్‌నెట్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ ఆపరేట్లతో పోటీ పడటానికి ఇప్పుడు తన ఆఫర్లను రిఫ్రెష్ చేసింది. ఎక్సిటెల్ మునుపు కేవలం మూడు నగరాల్లో మాత్రమే తన సేవలను అందించేది. అయితే క్రమేపి సంస్థ తన కార్యకలాపాలను 13 నగరాలకు విస్తరించింది. మొదట న్యూ ఢిల్లీలో ఎక్సైటెల్ సంస్థ కేవలం మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో మాత్రమే ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ స్ట్రీమర్స్, డౌన్‌లోడర్లు మరియు గేమర్‌లను లక్ష్యంగా చేసుకుని మూడు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను కలిగి ఉన్నాయి. హై-స్పీడ్ 300Mbps ప్లాన్ నెలకు కేవలం రూ.999 ధర వద్దనే లభిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరల పూర్తి వివరాలు
ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ స్ట్రీమర్‌లను లక్ష్యంగా చేసుకుని తన వినియోగదారుల కోసం 100Mbps ప్లాన్‌ను కేవలం ప్రారంభ ధర వద్ద నెలకు కేవలం రూ.699 ధర వద్ద అందిస్తున్నది. దీనిని మూడు నెలలు, నాలుగు నెలలు, ఆరునెలలు మరియు తొమ్మిది నెలల వాలిడిటీ కాలానికి కూడా ప్రభావవంతమైన ధర తగ్గింపుతో పొందవచ్చు. అలాగే 200Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను కేవలం రెండు ఎంపికలలో మాత్రమే కొనుగోలు చెయవచ్చు. ఇందులో ఒక నెలకు అయితే రూ .849 ధర వద్ద మరియు మూడు నెలలు వాలిడిటీ కాలానికి ఎంచుకున్న వారికి నెలకు కేవలం 638 రూపాయలు చెల్లించి పొందవచ్చు.

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ 300Mbps లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రయోజనాలు
ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ గేమర్‌ల కోసం అందిస్తున్న చివరి హై-స్పీడ్ ప్లాన్ 300Mbps ప్లాన్. దీనిని కస్టమర్లు ఒక నెల వాలిడిటీ కాలానికి 999 రూపాయల ధర వద్ద పొందవచ్చు. ఎవరైనా కస్టమర్ లాంగ్-వాలిడిటీ ఎంపికను ఎంచుకుంటే కనుక ఈ ప్లాన్‌కు మూడు నెలల వాలిడిటీలో నెలకు 752 రూపాయలు, నాలుగు నెలల వాలిడిటీలో నెలకు 636 రూపాయలు, ఆరునెలల వాలిడిటీలో నెలకు 600 రూపాయలు, తొమ్మిది నెలల వాలిడిటీలో నెలకు 533 రూపాయలు మరియు ఒక సంవత్సరం వాలిడిటీలో నెలకు కేవలం 499 రూపాయల ధర వద్ద ఎంచుకోవచ్చు.

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాల్ ఛార్జీలు
ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ పైన పేర్కొన్న ధరలు పన్నులకు ప్రత్యేకమైనవి. అలాగే కంపెనీ ఎటువంటి అదనపు ఇన్‌స్టాల్ ఛార్జీలను వసూలు చేయదు. అదనంగా ఎక్సైటెల్ ONU బ్రాడ్‌బ్యాండ్ రౌటర్ డివైస్ కోసం రూ .2,000 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. నాలుగు నెలల మరియు తొమ్మిది నెలల 100Mbps ప్లాన్ లు మొదటిసారి ఎక్సైటెల్‌లో చేరిన కొత్త చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ లభ్యత ప్రాంతాలు
ఎక్సైటెల్ నుండి దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటు ధరలో ఉన్నాయి. రూ.499 ప్రభావవంతమైన నెలవారీ ధర వద్ద 12 నెలల చెల్లుబాటు కాలానికి 300Mbps ప్లాన్ ను పొందడం అనేది నిజంగా మంచి ఎంపిక. ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, లక్నో, కాన్పూర్, ప్రయాగ్రాజ్, ఝాన్సీ, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రోహ్తక్ వంటి ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications