Excitel కొత్తగా 400 Mbps ప్లాన్‌ను విడుదల చేసింది!! మిగిలిన వారి కంటే తక్కువ ధరకే...

|

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో (ISPలు) ఒకటైన Excitel సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారులను మరింత అక్కటుకోవడానికి 400 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నెలకు కేవలం రూ.599 ధర వద్దనే అందిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు దీనిని దీర్ఘకాలిక చెల్లుబాటు ఎంపిక కోసం వెళ్లినప్పుడు ఈ హై-స్పీడ్ ప్లాన్ ఇంకా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే కంపెనీ ఇకపై ఒక నెల వాలిడిటీ ప్లాన్‌లను అందించడం లేదు. మీరు Excitel నుండి ఏదైనా ప్లాన్ ను తీసుకోవాలనుకుంటే కనుక కనీసం 3 నెలల చెల్లుబాటు కాలానికి తీసుకోవాలి. కంపెనీ యొక్క 400 Mbps ప్లాన్ కూడా 3, 6, 9 మరియు 12 నెలల చెల్లుబాటుతో ఎంచుకోవడానికి అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Excitel 400 Mbps ప్లాన్ వివరాలు

Excitel 400 Mbps ప్లాన్ వివరాలు

Excitel సర్వీస్ ప్రొవైడర్ తన యొక్క వినియోగదారులకు అందిస్తున్న 400 Mbps కొత్త ప్లాన్‌ను 3 నెలల చెల్లుబాటు కాలానికి ఎంచుకుంటే కనుక అది నెలకు రూ.833 ధర వద్ద అందిస్తుంది. వినియోగదారు అన్ని నెలల పాటు ఏకమొత్తంలో మొత్తం చెల్లించాల్సి ఉంటుందని గమనించండి. కాబట్టి మూడు నెలల ప్లాన్ కోసం వినియోగదారులు (రూ.833 x 3 + 18% GST) రూ. 2,948.82 ఖర్చు చేయవలసి ఉంటుంది. వాస్తవానికి 400 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు ఇది చాలా సాధారణమైన ధర కావడం విశేషం. అయితే మీరు ఆరు నెలల ప్లాన్‌ని ఎంచుకుంటే కనుక ఇది నెలకు రూ.699 ధర వద్ద లభిస్తుంది. కాబట్టి దీని ప్రభావవంతమైన ధర (రూ. 699 x 6 + 18%) రూ. 4,948.92. అదే ప్రాతిపదికన తొమ్మిది నెలల పన్నెండు నెలల ప్లాన్‌ల ధరలు వరుసగా రూ. 6998.58 మరియు రూ. 8,481.84.

ISP

దేశంలోని మరే ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP) కూడా తమ యొక్క 400 Mbps ప్లాన్‌లను ఇంత తక్కువ ధర వద్ద అందించడం లేదు. ఇంకా Excitel ప్లాన్‌లతో అందించే డేటా అపరిమితంగా ఉంటుంది. 400 Mbps ప్లాన్‌లలోని కస్టమర్‌లు కంపెనీ అందించే OTT బండిల్స్‌కు కూడా వెళ్లవచ్చు. Excitel అందించే ఇతర ప్లాన్‌లు 200 Mbps మరియు 300 Mbps వేగంతో వస్తాయి. Excitel ఉన్న 30+ నగరాల్లోని కస్టమర్‌లకు 400 Mbps ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

Excitel CEO

Excitel CEO మరియు సహ వ్యవస్థాపకుడు వివేక్ రైనా మాట్లాడుతూ "Excitel ఎల్లప్పుడూ సరసమైన ధరలలో అధిక వేగంతో ఇంటర్నెట్ డేటాను అందిస్తూ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. దేశంలో సగటు వేగం 1 Mbps ఉన్నప్పుడు మేము 20 Mbps పరిచయం చేయడంలో అగ్రగామిగా ఉన్నాము. మేము దీనిని ఇప్పుడు పరిచయం చేస్తున్నాము. 400 Mbps ప్లాన్ భారతీయ వినియోగదారులు మరియు కుటుంబాలు వారి అవసరాలను తీర్చడానికి - వినోదం, విద్య, పని, గేమింగ్ మరియు అన్ని విషయాల వీడియో అంతరాయం లేకుండా మరియు లాగ్-ఫ్రీ విధంగా ఉంటుంది."

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 300 Mbps ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 300 Mbps ప్లాన్‌

టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ రూ.1599 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లకు 300 Mbps వేగంతో 3.3TB లేదా 3300GB డేటాను పొందుతారు. అదనపు ప్రయోజనాల విషయాలలో ముందు ప్లాన్ లాగానే అలాగే ఉంటాయి. వినియోగదారులు Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు Disney+ Hotstar యొక్క అదనపు OTT ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి టీవీ మరియు నెట్‌ఫ్లిక్స్ రెండింటితో వచ్చే ఏకైక ప్లాన్ ఇది.

జియోఫైబర్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియోఫైబర్ ను ఎంచుకున్న వారు అధికంగా రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లాన్ అని ఇప్పుడు కంపెనీ విడుదల చేసింది. చాలా మంది వినియోగదారులు ఈ ప్లాన్ ను ఎంచుకుంటున్నందున ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వినియోగదారులకు 300 Mbps ఇంటర్నెట్ వేగంతో డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అందించే డేటా అపరిమితంగా ఉంటుంది. అయితే ఇక్కడ అపరిమిత అంటే నెలకు 3.3TB FUP (న్యాయమైన-వినియోగ-విధానం) పరిమితి డేటాగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ డేటా ప్రయోజనం రెండింటికీ సమరూపంగా ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే వినియోగదారులు అదనంగా అదనపు ప్రయోజనాలను పొందడం. ఈ ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్‌లకు జియో STBని ఉచితంగా కూడా అందిస్తుంది. ఇంకా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీLIV, ZEE5, Voot Kids, SunNXT, Voot Select, Hoichoi, డిస్కవరీ+, యూనివర్సల్+, లయన్స్ గేట్ ప్లే, ఎరోస్ నౌ, జియోసినిమా, షెమరూమీ, జియోసావన్, మరియు ALT బాలాజీ వంట OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా పొందుతారు.

Best Mobiles in India

English summary
Excitel Company Launches 400 Mbps Broadband New Plan at Rs.599 Per Month Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X