Lava బ్రాండ్ మొదటి 5G స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్!! దీపావళికి లాంచ్ ప్లాన్...

|

భారతీయ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ లావా ఇటీవల తన ప్రోబడ్స్ TWS ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసిన తర్వాత దేశంలో తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. అంతేకాకుండా ఈ ఏడాదే తన యొక్క మొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంటే ఈ సంవత్సరం రెండవ భాగంలో కంపెనీ భారీ రేంజ్ లో తన యొక్క ప్రణాళికలను ప్లాన్ చేసుకున్నది. ఈ రాబోయే ఉత్పత్తులు మరియు వాటి విస్తరణ ప్లాన్ లకు సంబంధించిన సమాచారం ఎంతవరకు నిజమో కనుకోవడానికి కంపెనీ యొక్క ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్‌తో మేము సంభాషించాము. సంస్థ తన మొదటి 5G పరికరాలను విడుదల చేయడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.

లావా మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌

"లావా సంస్థ యొక్క మా మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను సరికొత్త టెక్నాలజీతో ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నాం అని ఆయన చెప్పారు." అంతేకాకుండా ఇందులో వాడే టెక్నాలజీ ప్రస్తుతం మీరు ఉపయోగించే పరికరంలో లేదు అని ప్రత్యేకంగా తెలిపారు. అగ్రశ్రేణి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రత్యేకంగా గిజ్‌బాట్‌కు తెలియజేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర రూ.17,000 నుండి రూ.20,000 ధర లోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Pegasus spyware మీ ఫోన్‌కు సోకిందో తనిఖీ చేయడం ఎలా?Pegasus spyware మీ ఫోన్‌కు సోకిందో తనిఖీ చేయడం ఎలా?

5G స్మార్ట్‌ఫోన్‌

భారతీయ టెలికాం ఆపరేటర్లతో కలిసి 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొనివెళ్లే అవకాశాల కోసం కంపెనీ చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా టెలికాం ఆపరేటర్ల పర్యావరణ వ్యవస్థలో తమ హ్యాండ్‌సెట్ ఎలా సరిపోతుందో లావా చర్చించారు. 5G స్మార్ట్‌ఫోన్ కోసం టెలికం ఆపరేటర్లతో ట్రయల్స్ నిర్వహించడం గురించి అడిగినప్పుడు తేజిందర్ సమాధానం ఇచ్చారు. స్వదేశీ హ్యాండ్‌సెట్ తయారీదారు లావా ఇండియాలో తన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడమే కాకుండా తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను కూడా దీపావళికి తీసుకురావాలని యోచిస్తోంది.

2021 లో లావా విస్తరణ ప్లాన్ లు
 

2021 లో లావా విస్తరణ ప్లాన్ లు

స్వదేశీ హ్యాండ్‌సెట్ తయారీదారు లావా సంస్థ లాటిన్ అమెరికా వంటి కొత్త దేశాలలోకి ప్రవేశించాలని యోచిస్తున్నందున కంపెనీ తనను తాను కొన్ని మార్కెట్లకు మాత్రమే పరిమితం చేయకూడదని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఇతర దేశాలలో లావా మార్కెట్ విస్తరణ ప్లాన్ ల గురించి తేజిందర్ ను మేము అడిగినప్పుడు ఆయన తమ విస్తరణ గురించి తెలుపుతూ "మేము ఇప్పటికే 20 కి పైగా దేశాలలో పనిచేస్తున్నాము. ఇప్పుడు మేము కొన్ని ఆగ్నేయాసియా దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాలు మరియు లాటిన్ అమెరికాలోకి కూడా ప్రవేశిస్తున్నాము" అని మాతో పంచుకున్నారు. ఈ దేశాల్లోని పంపిణీదారులతో కంపెనీ చర్చలు జరుపుతోందని ఆయన ప్రత్యేకంగా అన్నారు.

2021లో లావా మార్కెట్ వాటా అంచనా

2021లో లావా మార్కెట్ వాటా అంచనా

2021 సంవత్సరం నాటికి కంపెనీ యొక్క కొత్త ప్రొడక్ట్ తో 10 శాతం మార్కెట్ వాటాను పెంచాలని చూస్తున్నారని సూచించారు. ఈ ఫీచర్ ఫోన్‌తో లావాకు 20 శాతానికి పైగా వాటా ఉందని గమనించడం ముఖ్యం. అయితే రాబోయే స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం వల్ల త్వరలో మొత్తం 10 శాతం మార్కెట్ వాటాను సాధిస్తామని కంపెనీ అభిప్రాయపడింది.

Best Mobiles in India

English summary
Exclusive: Lava Plans To Launch First 5G Smartphone And Smartwatch Near Diwali

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X