జియోతో సహా అన్ని టెల్కోలకు భారీ దెబ్బ, ఆ ఛార్జీలు సగం తగ్గింపు, ట్రాయ్ !

దేశీయ టెలికాం దిగ్గజాలకు ట్రాయ్ భారీ షాక్ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

By Hazarath
|

దేశీయ టెలికాం దిగ్గజాలకు ట్రాయ్ భారీ షాక్ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటర్ కనెక్టివిటీ ఛార్జీలపై ఇప్పటికే కిందా మీదా పడుతున్న టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, జియోలను ట్రాయ్ గట్టి దెబ్బనే కొట్టబోతోంది. అంతర్జాతీయ టర్మినేషన్‌ ఛార్జీలను సగానికి సగం తగ్గించే దిశగా ట్రాయ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే టెలికాం దిగ్గజాలు మరింతగా ఆందోళనలోకి వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.

వాట్సప్‌లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్‌లో గ్రూపు చాటింగ్‌లు !వాట్సప్‌లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్‌లో గ్రూపు చాటింగ్‌లు !

25 నుంచి 30 పైసలకు..

25 నుంచి 30 పైసలకు..

ఇప్పటికే మొబైల్‌ టెర్మినేషన్‌ కాల్‌ఛార్జీలను భారీగా తగ్గించిన ట్రాయ్, ఇంటర్నేషనల్‌ టర్మినేషన్‌ ఛార్జీలను కూడా భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిమిషానికి 53 పైసలుగా ఉన్న ఈ ఛార్జీలను 25 నుంచి 30 పైసలకు తగ్గించబోతున్నారని తెలుస్తోంది.

ట్రాయ్ బలమైన నిర్ణయం..

ట్రాయ్ బలమైన నిర్ణయం..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనధికార సమాచారం ప్రకారం ఈ విషయంపై ట్రాయ్ బలమైన నిర్ణయం తీసుకోనుందని నేడో రేపో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

మొబైల్స్‌, ల్యాండ్‌లైన్‌ కాల్స్‌ అన్నింటికీ..
 

మొబైల్స్‌, ల్యాండ్‌లైన్‌ కాల్స్‌ అన్నింటికీ..

కాగా ఇంటర్నేషనల్‌ టర్మినేషన్‌ ఛార్జీలను ఓ టెలికాం ఆపరేటర్‌, కాల్‌ టర్మినేట్‌ చేసే సర్వీసు ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మొబైల్స్‌, ల్యాండ్‌లైన్‌ కాల్స్‌ అన్నింటికీ ఈ ఛార్జీలను చెల్లిస్తారు. ఈ ఛార్జీను ఇంటర్నేషనల్‌ ఆపరేటర్‌ తన సబ్‌స్క్రైబర్‌ నుంచి రికవరీ చేసుకుంటారు.

40 పైసల నుంచి 53 పైసలకు..

40 పైసల నుంచి 53 పైసలకు..

2015 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్‌ టర్మినేషన్‌ ఛార్జీలను నిమిషానికి 40 పైసల నుంచి 53 పైసలకు ట్రాయ్‌ పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో మొబైల్‌ టర్మినేషనల్‌ ఛార్జీలను మాత్రం నిమిషానికి 20 పైసల నుంచి 14 పైసలకు తగ్గించింది.

ఈ ఛార్జీలను మరింత కిందకు తీసుకురావాలని..

ఈ ఛార్జీలను మరింత కిందకు తీసుకురావాలని..

అయితే ఈ ఛార్జీలను మరింత కిందకు తీసుకురావాలని ట్రాయ్ సెప్టెంబర్‌ 19న టెలికాం దిగ్గజాలకు తెలిపింది. మొబైల్‌ టర్మినేషన్‌ ఛార్జీలను మరింత కిందకి 6 పైసలకు తీసుకురావడంతో పాటు ఈ ఛార్జీలను జీరో చేయాలని యోచిస్తున్నట్టు ట్రాయ్‌ ఆ సమయంలో పేర్కొంది.

ట్రాయ్ తాజాగా తీసుకోబోయే నిర్ణయంపై..

ట్రాయ్ తాజాగా తీసుకోబోయే నిర్ణయంపై..

కాగా ట్రాయ్ తాజాగా తీసుకోబోయే నిర్ణయంపై ఇంటర్నేషనల్‌ టెలికాం సంస్థలు ఏటీ అండ్‌ టీ, వెరిజోన్‌ హర్షం వ్యక్తంచేస్తుంటే దేశీయ టెలికాం సంస్థలు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ట్రాయ్ నిర్ణయంతో భారీ నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని,ట్రాయ్ ఈ విషయంపై ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.

Best Mobiles in India

English summary
EXCLUSIVE: TRAI may today halve international interconnect charge to 25-30 paise in telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X