ఈ ఫ్యాన్లకు పంకలు ఉండవు, ఎలాంటి శబ్దం రాదు
డొమెక్ సొల్యూషన్స్ ఇండియన్ మార్కెట్‌లోకి సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ఎక్స్‌హీల్ కంపెనీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో రెక్కల రహిత (బ్లేడ్ లెస్) ఫ్యాన్లను విడుదల చేసింది. ఎక్స్
డొమెక్ సొల్యూషన్స్ ఇండియన్ మార్కెట్‌లోకి సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ఎక్స్‌హీల్ కంపెనీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో రెక్కల రహిత (బ్లేడ్ లెస్) ఫ్యాన్లను విడుదల చేసింది. ఎక్స్ హీల్ కంపెనీ రూపొందించిన ఈ ప్రొడక్ట్‌ను డొమెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ, ఏపీల్లో అమ్మనున్నట్లు డొమెక్ ఎండీ రఘురామిరెడ్డి తెలిపారు.

ఈ ఫ్యాన్లను లాంచ్ చేసిన సందర్భంగా.. ఈ ఫ్యాన్లు ఫ్యూచర్ జనరేషన్ ఫ్యాన్లుగా మంచి మార్కెటింగ్‌ను సొంతం చేసుకోనున్నాయని డొమెక్ సొల్యూషన్స్ ఎండీ రఘురామిరెడ్డి, డైరెక్టర్ రామ కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఫ్యాన్లలో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయని వారు తెలిపారు. ఫీచర్లలను ఓ సారి పరిశీలిస్తే...

ఫ్యాన్ల ధర
ఎలాంటి శబ్దం లేకుండా శుద్ధి చేసిన గాలిని ఇవ్వడం ఈ ఫ్యాన్ల ప్రత్యేకతగా చెప్పవచ్చు. రెండు మోడళ్లలో విడుదల చేసిన ఈ ఫ్యాన్లలో ఒక్కటి రూ.23,500కి లభించనుండగా, మరొకటి రూ.25,600లకు వస్తుంది.

360 డిగ్రీల్లో
సాధారణ సీలింగ్ ఫ్యాన్స్‌లా రెక్కలు లేకుండా సీలింగ్‌కు ఒక డిజైన్‌లా ఈ ఫ్యాన్ ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ఫ్యాన్ అన్ చేయగానే రూంలో అప్పటి వరకున్నగాలినంతా అది తీసుకొని దాన్ని శుద్ధి చేసి 360 డిగ్రీల్లో ఆ గాలిని రూంలో సర్క్యూలేట్ చేయటం ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత అని చెప్పారు.

8 గంటల వరకు అదే టెంపరేచర్
శుద్ధిచేసిన గాలిని ఇవ్వటమే కాకుండా ఏసీని కొద్దిసేపు మనకు కావాల్సిన టెంపరేచర్ లో ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసినా కూడా 8 గంటల వరకు అదే టెంపరేచర్ ఉంచగలుగుతుందని కంపెనీ అధినేతలు చెబుతున్నారు.

రూ.10 కోట్ల పెట్టుబడితో
వీటిని తయారు చేయడానికి చెన్నై సమీపంలో రూ.10 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేశా మని, నెలకు 14 వేల యూనిట్లు ఉత్పత్తవుతున్నాయన్నారు. వీటిలో సగం దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న సంస్థ మిగతావి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


Click it and Unblock the Notifications