స్టాక్ మార్కెట్లకు కళ తెచ్చిన ఇన్పోసిస్ త్రైమాసిక ఫలితాలు

By Super
|
Infosys
బెంగళూరు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్‌ రెండవ త్రైమాసికంలో సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో కన్సాలిడేటెడ్‌ విధానంలో సంస్థ నెట్‌ ప్రాఫిట్‌ 9.72 శాతం పెరిగి 1,906 కోట్ల రూపాయలకు చేరింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఇన్ఫీ నికర లాభం 1,737 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం 6,947 కోట్ల నుంచి 16.58 శాతం పెరిగి 8,099 కోట్ల రూపాయలకు చేరింది.

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ముందుగా అంచనా వేసిన ఆదాయం కన్నా 6 శాతం అధిక రెవెన్యూ కళ్ళజూడనున్నామని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌డి షిబూలాల్‌ వ్యాఖ్యానించారు. మార్చి నాటికి 6 శాతం వృద్ధితో 33,795 కోట్ల రూపాయల టర్నోవర్‌ అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితితో నిండిందని, ఐటి పరిశ్రమకు ఇది విఘాతమేనని వివరించిన ఆయన ఈ పరిస్థితుల్లో వృద్ధికోసం క్లయింట్లు కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారని అన్నారు.

 

దేశంలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల రెవె న్యూలో 85 శాతం అమెరికా, యూరోప్‌ల నుంచే వస్తాయి కాబట్టి డాలర్‌ పడితే మన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లకు పండగే!ఇన్ఫోసిస్‌ థామ్సన్‌ రాయిటర్‌కు చెందిన హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని 700-750 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని.. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఇన్ఫోసిస్‌ సీఈవో ఎండీ ఎస్‌డీ షిబూల్‌ ఇక్కడ విలేకరులకు చెప్పారు. రెండవ త్రైమాసికంతో కం పెనీ రెవెన్యూ 16.6 శాతం పెరిగి రూ.8,099 కోట్లకు చేరింది. ఇదే జోరుతో మూడవ త్రైమాసానికి రెవెన్యూ మరింత పెంచుకుంటామని డిసెంబర్‌31తో ముగిసే త్రైమాసానికి తమ రెవెన్యూ అంచనా రూ.8,826 కోట్ల నుంచి రూ.9,012 కోట్లు ఉంటుందని వృద్ధిరేటు 24.2 నుంచి 26.8 శాతం మధ్య ఉంటుందని ఆయన అన్నారు.

 

మార్చి 31, 2012 నాటికి తమ రెవెన్యూ అంచ నా రూ.33,501 కోట్ల నుంచి రూ.34,088 కోట్ల మధ్య లో ఉంటుందని వృద్ధిరేటు 21.8 శాతం నుంచి 24 శాతం మధ్యలో ఉంటుందని ఆయన వివరించారు. గత కొన్ని త్రైమాసికాల నుంచి ఇన్ఫోసిస్‌ ఫలితాలు పేలవంగా ప్రక టించడంతో మార్కెట్లో దీని షేరు పతనమవుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలు అంచనాను మించి ప్రకటించడం వల్ల స్టాక్‌ మార్కెట్‌లకు కళవచ్చింది.

ఇది ఇలా ఉంటే థామ్సన్‌ రాయిటర్స్‌కు చెందిన హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని ఇన్ఫోసిస్‌ టెకోవర్‌ చేయాలనుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ డీ షిబుల్‌ ఇక్కడ పత్రికా విలేకరులకు చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా థామ్సన్‌ రాయిటర్స్‌కు చెందిన హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని కైవసం చేసుకుంటాం. దీనికి 700-750 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X