యాహూ మెయిల్ కాంటాక్ట్‌లను జీ-మెయిల్‌కి ఇంపోర్ట్ చెయ్యడం ఎలా?

Posted By: Staff

యాహూ మెయిల్ కాంటాక్ట్‌లను జీ-మెయిల్‌కి ఇంపోర్ట్ చెయ్యడం ఎలా?

ఈ మధ్యకాలంలో జీ-మెయిల్ వాడకం బాగా పెరిగింది...అది అందిస్తున్న సర్వీసెస్ వల్ల కానీ మరి ఏ యితర కారణాల వల్ల కానీ చాలా మంది యహూ మరియు యితర మెయిల్ యూజర్లు జీ-మెయిల్ కి మారారు. ఈ పరిస్ధితిలో యాహూ లో వున్న Contacts ని జీ-మెయిల్ కి ఎలా ఇంపోర్ట్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం...

1.ముందుగా యాహూ మెయిల్ కి లాగిన్ అవ్వాలి. ’Contacts' టాబ్ పై క్లిక్ చేసి ’Import/Export' పై క్లిక్ చెయ్యాలి.

2.క్రింద వున్న ’Export' దగ్గర 'Yahoo!CSC:' దగ్గరవున్న ’Export Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

3.CSV ఫైల్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి.

4.ఇప్పుడు Gmail లాగిన్ చేసి ’Contacts' పై క్లిక్ చెయ్యాలి.

5.ఇక్కడ ’Import' పై క్లిక్ చెయ్యాలి.

6.’Browse' బటన్ పై క్లిక్ చేసి ఇంతకుముందు యాహూ నుండి సేవ్ చేసుకొన్న CSV ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రిందవున్న ’Import' పై క్లిక్ చెయ్యాలి.

7.కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చెయ్యబడిన తర్వాత ’Ok' పై క్లిక్ చెయ్యాలి. అంతే యాహూ మెయిల్ లోని Contacts అన్నీ Gmail లోకి వచ్చేస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting