భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై షాకింగ్ రిపోర్టు.. సగటున రోజుకు 5 గంటలు ఫోన్‌తోనే..!
భారత్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ ధర చాలా అధికంగా ఉండేది. నెలవారీ కేవలం 1GB డేటా కోసం రూ.200 -300 చెల్లించాల్సిన అవసరం ఉండేది. స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కూడా అధికంగా ఉండేది. టెలికాం రంగంలోకి జియో వచ్చిన తర్వాత డేటా వినియోగంలో భారీ మార్పులు వచ్చాయి. అన్‌లిమిటెడ్ డేటా సహా తక్కువ ధరకే డేటా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా భారత్‌లో కోట్లాది మంది స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. ఏ స్థాయిలో వినియోగిస్తున్నారు (indians smartphone usage) అంటే.. టెలివిజన్ వ్యూస్ కంటే ఈ డిజిటల్ ఛానళ్ల వ్యూస్ అధికంగా వచ్చేంత స్థాయిలో ఉపయోగిస్తున్నారు.
ఇటీవల డేటా వినియోగంపై ఓ నివేదిక వచ్చింది. దీని ఆధారంగా నెలవారీ సగటున 27.5GB డేటాను వినియోగిస్తున్నారు. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడమే దీనికి కారణమని చెబుతోంది. 5G విస్తరణ ఇదే వేగంతో ఉండే డేటా వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

డిజిటల్ ఇన్‌ఫెక్షన్ పాయింట్ :
అయితే తాజాగా ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. భారతీయులు ఎంత ప్రమాదకర స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారో ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ ఇన్‌ఫెక్షన్ పాయింట్ కు దేశం చేరుకుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో అధికంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది.
రోజుకు సగటున 5 గంటలు :
భారతీయుల ఫోన్ వాడకంపై ఎర్నెస్ట్ యంగ్ (EY) ఇండియా నివేదిక వెల్లడించింది. 2024 లో భారతీయులు 1.1 లక్షల కోట్ల గంటలు ఫోన్‌తోనే గడిపారని వెల్లడించింది. అంటే రోజుకు సగటున 5 గంటలు ఫోన్ వినియోగించారని పేర్కొంది. ఫోన్‌లతో అధిక సమయం గడిపే వారి జాబితాలో ఇండోనేషియా, బ్రెజిల్ తర్వాత భారత్ నిలిచిందని నివేదిక తెలిపింది.
భారత ప్రజలు రోజుకు సగటున 5 గంటలపాటు ఫోన్‌తో గడుపుతున్నారు. ఇందులో 70 శాతం సమయం సోషల్ మీడియా, గేమింగ్, వీడియో కంటెంట్‌ను వీక్షిస్తున్నారని EY నివేదిక తెలిపింది. ఈవెంట్‌లు, షోలు సహా స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను ఎక్కువ శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లలోనే చూస్తున్నారని పేర్కొంది.
అతి పెద్ద విభాగంగా :
ఫలితంగా టీవీ ఛానళ్ల వ్యూస్ కంటే ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంల వ్యూస్ ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. 2024 లో డిజిటల్ ఛానళ్లు దేశంలోని సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయల మీడియా, వినోద పరిశ్రమలో అతిపెద్ద విభాగంగా నిలిచాయని నివేదిక వెల్లడించింది.
తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 562 మిలియన్‌ల మంది స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తు్న్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో డిజిటల్ ఇన్‌ఫెక్షన్ పాయింట్ కు దేశం చేరుకుందని EY ఇండియా అధినేత ఆశిష్ ఫెర్వానీ తెలిపారు.
డిజిటల్ ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని, కంటెంట్ క్రియేటర్‌లకు మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయని జియోస్టా్ర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ CEO కెవిన్ వాజ్ తెలిపారు. కేవలం రెండు నెలల సమయంలోనే జియోహాట్‌స్టార్ ఓటీటీ 100 మిలియన్‌ల పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లను పొందింది.
అత్యంత తక్కువ ధరకు డేటా అందుబాటులోకి రావడం సహా స్మార్ట్‌ఫోన్‌లు కూడా చౌకగా లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ దారులకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు భారీ డిమాండ్ ఉంటోంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూజర్‌లను ఆకట్టుకొనే విధంగా కొత్త కొత్త ఫీచర్‌లు, డిజైన్‌లతో విడుదల చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








