సికింద్రాబాద్ డివిజన్ రైళ్ల సమాచారం ఇప్పుడు ఫేస్‌బుక్‌లో....

Posted By: Super

 సికింద్రాబాద్ డివిజన్ రైళ్ల సమాచారం ఇప్పుడు ఫేస్‌బుక్‌లో....

 

ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్స్‌ని కలిగి ఉన్న సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొత్త పుంతలు తొక్కుతుంది. సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి బయలు దేరే రైలు, స్టేషన్‌కు వచ్చే రైలుకు సంబంధించిన తదితర వివరాలను సామాజిక వెబ్‌సైట్  ఫేస్‌బుక్ www.scr.indianrailways.gov.in లో లైవ్ స్టేటస్ విభాగంలో పూర్తి సమాచారం లభించనుంది.

రైల్వే వెబ్ సైట్లతో పాటు ఫేస్‌బుక్‌లో సికింద్రాబాద్ డివిజన్ ద్వారా ప్రత్యేక్షంగా రైళ్ల రాకపోకలను తెలుసుకునే విధానాన్ని జనరల్ మేనేజర్ ఆస్తానా ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రత్యేకమైన డిస్ ప్లే బోర్డులో ప్రదర్శించే సమాచారన్ని లైవ్‌ ఇంటర్నెట్లో అందిస్తారు. ఫేస్ బుక్‌లో ఎప్పటికప్పడు ఈ వివరాలను నమోదు చేస్తారు.

దీని గురించి యూజర్స్ తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్ లోని సికింద్రాబాద్ డివిజన్ పేజిలో బేసిక్ ఇన్పర్మేషన్ విభాగంలోని మిషన్ ప్రక్కనున్న లింక్‌ను క్లిక్ చేయాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot