ఫేస్‌బుక్ 'రేప్ కల్చర్'ని ప్రోత్సహిస్తుంది: మహిళా సంఘాలు

Posted By: Staff

ఫేస్‌బుక్ 'రేప్ కల్చర్'ని ప్రోత్సహిస్తుంది: మహిళా సంఘాలు

ప్రపంచపు పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొత్త ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ఆరోపణలు ఏంటనీ అనుకుంటున్నారా..లండన్, అమెరికా దేశాలలో ఉన్న మహిళా సంఘాలు 'ఫేస్‌బుక్ రేప్ కల్చర్'ని ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇందుకు గల కారణాలను కూడా మహిళా సంఘాలు విశ్లేషించడం జరిగింది.

సెక్సువల్‌గా భాదింపబడిన ఆడవారిపై యాజర్స్ వేసేటటువంటి పిచ్చి జోకులు, వారికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఫేస్‌బుక్ తన పేజీలలో ఉంచడం జరుగుతుంది. దీని ద్వారా ఆడవారిగా ఇలాంటి పేజీలను తొలగించమని కొరడం మా భాద్యత అని అన్నారు. ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లైతే అమెరికా, లండన్ లాంటి దేశాలలో ఆడవారిపై దౌర్జన్యాలు, దురాగతాలు, సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టడం లాంటివి ఎక్కవైపోయాయి. ఇలాంటి వాటన్నింటిని ఫేస్‌బుక్ తన పేజీలలో ప్రచురించి వారికి మరింత పబ్లిసిటీని కల్పించడం జరుగుతుంది.

ఇలాంటి పేజీలన్నింటిని నిషేదించాల్సిందిగా బ్రటిన్‌కు చెందిన 3,600 మహిళలు, అమెరికాకు చెందిన 1,75,000 మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గోనడం జరిగింది. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ పేపర్ ఈ విషయంపై ఫేస్‌బుక్‌పై విరుచుక పడింది. చివరకు దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ యాజమాన్యం మాత్రం రేప్ కల్చర్‌కు సంబంధించిన పేజీలను తీసివేయడానికి మాత్రం నిరాకరించింది.

ఫేస్‌బుక్ అనేది సామాజిక వెబ్ సైట్. ఎవరి అభిప్రాయాలను వారు యధేచ్చగా వ్యక్తపరుచుకొవచ్చని తెలిపింది. ఫేస్‌బుక్ తనని తాను సమర్దించుకొవడమే కాకుండా ప్రపంచం మొత్తం ఒక్క ఫేస్‌బుక్ లోనే ఇలాంటి కంటెంట్‌ ఉన్నట్లు ఒక్క ఫేస్‌బుక్‌నే ఇలా మహిళా సంఘాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఈ విషయాన్ని కొట్టిపారేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot