ఫేస్‌బుక్ ఒప్పుకుంది!

Posted By: Prashanth

ఫేస్‌బుక్ ఒప్పుకుంది!

 

న్యూఢిల్లీ: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పలు అల్లరిమూకలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నితొలగించాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఫేస్‌బుక్ సానుకూలంగా స్పందించింది. హింస, ద్వేషాన్ని రగిల్చే సమాచారం, ఉపన్యాసాలున్న వెబ్‌పేజీలను తొలగిస్తామని, వాటిని అప్‌లోడ్ చేసే నెటిజన్ల అకౌంట్లను బ్లాక్ చేస్తామని బుధవారం తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పాక్, భారత్‌లోని తమ అధికారులు సామాజిక బాధ్యతగా రోజుకు 24 గంటలూ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని పరిశీలిస్తూ, తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పింది. అసోం అల్లర్ల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లోని ఈశాన్య ప్రాంత వాసులపై దాడులు జరుగుతాయని ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర వెబ్‌సైట్లలో వదంతులు రావడం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot