ఫ్యాన్స్ కోసం ఫేస్‌బుక్‌లో మెగాస్టార్!

Posted By: Staff

ఫ్యాన్స్ కోసం ఫేస్‌బుక్‌లో  మెగాస్టార్!

తన అభిమానులకు మరింత చేరువుకావాలన్న సంకల్పంతో బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ పేస్‌బుక్‌లో మంగళవారం సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకుంటున్న బిగ్‌బీకి మిలియన్ల సంఖ్యలో అభిమానులున్నారు. అమితాబ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ పై రాబోయే చిత్రాల సమాచారంతో పాటు సినిమా వీడియోలు, ప్రత్యేక ఫోటో కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు. 69 సంవత్సరాల ఈ సొగసరి బాలివుడ్ సూపర్‌స్టార్ ఇప్పటికే తన ఫేస్‌బుక్

టైమ్‍లైన్ పై ఓ వీడియో‌ను పోస్ట్ చేశారు. తన ఆరాధికులతో మరింత మమేకమవ్వాలన్న సుదద్ధేశ్యంతో మార్క్ జూకర్‌బర్డ్స్ సోషల్ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తనను ఆదరిస్తున్న వారితో క్రమంగా క్రమంగా కమ్యూనికేషన్ బంధాలను ధృడపరుచుకునేందకు ఈ ప్రసార మాధ్యమం మరింత తోడ్పడగలదని ధీమా వ్యక్తం చేశారు.

తాను ఫేస్‌బుక్‌లో సుభ్యత్వం తీసుకున్న విషయాన్ని బచ్చన్ స్వయంగా ట్వీట్టర్ ద్వారా ధృవీకరించారు. మిస్టర్ బచ్చన్ ట్వీట్ చేసిన సందేశంలో ‘Yipee! I am on FaceBook! My ID: FaceBook.com/AmitabhBachchan,” ”And!! Its close to 8 lakhs in half an hour!! Keep it coming, Baby.” అని పేర్కొన్నారు. యాక్టివేట్ అయిన కొద్ది కాలంలోనే అమితాబ్ బచ్చన్ ఫేస్‌బుక్ పేజ్ 804,851 మంది దృష్టిని ఆకర్షించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot