ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్ సేవలు వారంలో మరోసారి నిలిచిపోయాయి!!

|

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ మరియు దాని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా మరొకసారి డౌన్ అయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. కానీ వారు తరచుగా అంతరాయాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారం ప్రారంభంలో మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌తో సహా ఫేస్‌బుక్ సేవలు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోయాయి. ఇది కంపెనీ చరిత్రలో సుదీర్ఘమైన అంతరాయం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి

డౌన్‌టెటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో తాజా అంతరాయం రెండు గంటల కంటే ఎక్కువగా ఉంది. గత రాత్రి 11:50 IST నుండి 2:20 am IST వరకు ఈ అంతరాయం జరిగింది. ఈ రెండు గంటల అంతరాయం సమయంలో వినియోగదారులు ప్రధానంగా యాప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఈ అప్లికేషన్ లోపాన్ని చూపించింది మరియు ఫీడ్‌ని రిఫ్రెష్ చేయలేదు. ప్లాట్‌ఫారమ్‌లో లైవ్ మెసేజ్లను పంపడం లేదా అందుకోవడంలో ఇబ్బందులు ఎదురుకున్నారు అని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

T20 ప్రపంచకప్ కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు....T20 ప్రపంచకప్ కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు....

 

ఇన్‌స్టాగ్రామ్ అంతరాయానికి గురైన వెంటనే వినియోగదారులు స్టేటస్ మరియు ఫోటో-షేరింగ్ యాప్ ఎందుకు పనిచేయడం లేదో తనిఖీ చేయడానికి మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఆశ్రయించారు. #Instagram down #instadown వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ కావడం ప్రారంభించాయి.

అమెజాన్ ఫైర్ టీవీ 4K మాక్స్ అమ్మకాలు మొదలయ్యాయి!! ఆఫర్స్ మిస్ అవ్వకండిఅమెజాన్ ఫైర్ టీవీ 4K మాక్స్ అమ్మకాలు మొదలయ్యాయి!! ఆఫర్స్ మిస్ అవ్వకండి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు డౌన్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఫేస్‌బుక్ ఆగిపోయినట్లు గుర్తించి "కొంతమంది వ్యక్తులు మా యాప్‌లు మరియు ఉత్పత్తులను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి రావడానికి మేము కృషి చేస్తున్నాము. ఏదేమయిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. " అని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటనను విడుదల చేసి కంపెనీ క్షమాపణలు తెలిపారు.

Instagram

అయితే సోషల్ మీడియా దిగ్గజం అంతరాయం వెనుక నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. సమస్య పరిష్కరించబడిన తర్వాత Instagram చెప్పిన విషయాలు పరిష్కరించబడ్డాయి మరియు ఇప్పుడు ప్రతిదీ సాధారణ స్థితికి తీసుకొని వచ్చింది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు ఈ వారం అన్ని మీమ్‌ల కోసం అంటూ అధికారిక ట్వీట్ ద్వారా తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook and Instagram Social Media Apps Were Down Few Hours Last Night: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X