'ఓపెన్ గ్రాఫ్' కోసం 'ఫేస్‌బుక్' లోకి 60 మంది భాగస్వాములు..

Posted By: Staff

 'ఓపెన్ గ్రాఫ్' కోసం 'ఫేస్‌బుక్' లోకి 60 మంది భాగస్వాములు..

 

పోయిన సంవత్సరం 'ఎఫ్8' కాన్ఫెరన్స్‌లో ప్రస్తావించిన విధంగా ఫేస్‌బుక్ ఈ రోజు(జనవరి 19,2012)న శాన్ ఫ్రాన్సికో లో తలపెట్టిన ఈవెంట్లో 'ఓపెన్ గ్రాఫ్ చొరవ'ని 60 కొత్త పాట్నర్స్‌తో విస్తరించేందుకు సిద్దమైనట్లు ప్రకటించనుంది. ఫేస్‌బుక్ విడుదల చేయనున్న 60 అప్లికేషన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో అందుబాటులోకి రానుంది.

డెవలపర్స్ ఎంతో కష్టపడి రూపొందించిన ఓపెన్ గ్రాఫ్ డెవలప్‌మెంట్ ఫ్లాట్ ఫామ్ త్వరలో ఫేస్బుక్ విస్తరించనుంది. ఈ ఓపెన్ గ్రాఫ్‌లో మొదటి నుండి కూడా స్పోటిఫై, రియోలు పాట్నర్స్‌గా వ్యవహారిస్తున్నాయి. ఈ ఓపెన్ గ్రాఫ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీ స్నేహితులు రియల్ టైమ్ ఫేస్‌బుక్ టిక్కర్‌లో ఏమి వింటున్నరో  మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఓపెన్ గ్రాఫ్ డెవలపర్స్‌కి అందుబాటులోకి తీసుకోచ్చారు.

ఈ ఓపెన్ గ్రాఫ్‌లో రాబోయే కాలంలో “listen”, “watching”, “reading” లాంటి పదాలు రానున్నాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్ వీటికి సంబంధించిన గైడ్ లైన్స్‌ని రూపొందిస్తుంది. వీటితో పాటుగా 60 కొత్త పాట్నర్స్‌(Pinterest, Ticketmaster, Airbnb)ని ఫేస్‌బుక్ తీసుకురానుంది. కొత్త డెవలపర్స్ రూపొందించిన అప్లికేషన్స్‌ని ఫేస్‌బుక్ ఇప్పడిప్పుడే అంగీకరిస్తుంది. ఫేస్‌బుక్ కూడా ఈరోజు వినియోగదారుల కోసం కొత్త అప్లికేషన్ ఇనిస్టాల్ చేసి, ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ కొత్త అప్లికేషన్స్ రాకతో ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌కి కొత్త ప్రాముఖ్యత రానుంది. ఫేస్‌బుక్ విడుదల చేయనున్నఈ అప్లికేషన్లు కుడి చేతి వైపున కనిపిస్తాయి. వీటన్నింటిలో కెల్లా కూల్ అప్లికేషన్‌గా Pinterestని భావిస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త అప్లికేషన్స్‌ని ఫేస్‌బుక్ ఇనిస్టాల్ చేసి యూజర్స్‌కు మరింత సులభతరం చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot