వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ,పూర్తి సమాచారం మీకోసం !

By Gizbot Bureau
|

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోంది. వచ్చేవారంలో మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మల్టినేషనల్ కంపెనీ ఫేస్ బుక్ బిట్ కాయిన్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ,పూర్తి సమాచారం మీకోసం !

ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్ టెక్నాలజీస్ భాగస్వామలుగా ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ తెలిపింది. ఈ వర్చువల్ కరెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

 ఒక్కో సంస్థ 10 మిలియన్ల డాలర్లు

ఒక్కో సంస్థ 10 మిలియన్ల డాలర్లు

ఫేస్ బుక్ బిట్ కాయిన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ఒక్కో సంస్థ 10 మిలియన్ల డాలర్లు (రూ.70 కోట్లు వరకు) పెట్టుబడి పెట్టనున్నట్టు రిపోర్టు నివేదించింది. దీనికంటే ముందే అర్జెంటైనా బేసిడ్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం మెర్కాడోలిబ్రే, యూఎస్ బేసిడ్ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ స్ట్రయిప్, బుకింగ్స్.కామ్ (హోటల్ బుకింగ్ ప్లాట్ ఫాం) కంపెనీలు ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీకి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కొత్త క్రిప్టోకరెన్సీ రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది.

కంపెనీలు ఇవే

కంపెనీలు ఇవే

బిట్‌కాయిన్ వంటి ‘‘బ్లాక్ చెయిన్'' టెక్నాలజీలతో కలిగే ముప్పును ఎదుర్కునే విధంగా కూడా ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంటున్నట్టు భావిస్తున్నారు. లిబ్రా పేరుతో ఫేస్‌బుక్ ఏర్పాటు చేస్తున్న కన్సార్షియంలో ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్‌, పేపాల్, ఊబర్ సహా 12కి పైగా కంపెనీలు చేరినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అమెరికా ట్రెజరీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి కూడా ఫేస్‌బుక్‌కు ఆశీస్సులు అందినట్టు బీబీసీ గత నెలలో వెల్లడించింది. ఊబర్, వోడాఫోన్, ఈబే, స్పాటిఫై, లిఫ్ట్ వంటి సంస్థలు కూడా ఫేస్ బుక్ లిబ్రా అసోసియేషన్ లో భాగం కానున్నాయి. లిబ్రా క్రిప్టోకరెన్సీ అధికారిక విడుదలకు ముందు 100 మంది సభ్యులను పొందాలని ఫేస్ బుక్ లక్ష్యంగా పెట్టుకుంది.

కరెన్సీని దూరంగా ఉంచేందుకు

కరెన్సీని దూరంగా ఉంచేందుకు

కాగా క్రిప్టోకరెన్సీ విలువల్లో భారీగా హెచ్చుతగ్గులతో పాటు నేరస్తులు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో.. సామాన్యులకు నష్టం కలగకుండా బ్యాంకులు దీనిని దూరం పెడుతున్నాయి. అయితే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్‌ల ద్వారా 200 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగిన ఫేస్‌బుక్‌... ఇలాంటి ప్రమాదాల నుంచి తమ కరెన్సీని దూరంగా ఉంచేందుకు అవకాశం ఉంది.

 వుయ్‌చాట్ మాదిరిగా

వుయ్‌చాట్ మాదిరిగా

చైనాలో వుయ్‌చాట్ మాదిరిగా ఫేస్‌బుక్ తన క్రిప్టోకరెన్సీని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు చాటింగ్‌తో పాటు షాపింగ్ చేసేందుకు, గేమ్స్ ఆడుకునేందుకు వియ్‌చాట్ అవకాశం కల్పిస్తోంది. ఒకే పోర్టల్లో ఈ తరహా సేవలన్నీ అందించడం, వినియోగదారులు దీన్ని వదలకుండా చూసుకుంటుండడంతో వియ్‌చాట్‌కు మరింత ఆదాయం లభిస్తోంది. దీంతో చైనాలో నిషేధం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ ఫేస్‌బుక్ సైతం ఇదే తరహా సేవలతో ఆదాయం ఆర్జించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు

మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు

ఈ ప్రాజెక్టులో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నుంచి మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు అందుతాయని ఫేస్ బుక్ విశ్వసిస్తోంది. ఫేస్ బుక్.. స్థిరమైన కాయిన్ కరెన్సీని సృష్టించాలని చూస్తోందని 2018 ఏడాదిలో బ్లూమ్ బర్గ్ రిపోర్టు వెల్లడించింది.ఈ కాయిన్ కరెన్సీతో తమ సోషల్ ప్లాట్ ఫాం మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ట్రాన్స్ ఫర్ చేసుకునేలా సేవలు అందించాలని భావిస్తోంది. ఒక్క ఇండియాలోనే వాట్సప్ లో 20 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

పేపాల్ మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్కస్

పేపాల్ మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్కస్

యూఎస్ డాలర్ కు ధీటుగా స్థిరమైన కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలను డిజైన్ చేయాలని ఎప్పటినుంచో ఫేస్ బుక్ యోచిస్తోంది. యూఎస్ డాలర్ విలువ తగ్గకుండా స్థిరంగా ఉండేందుకు ఈ బిట్ కాయిన్ కరెన్సీని తీసుకురానున్నారు. 2014లో ఫేస్ బుక్ సంస్థ.. తమ మెసేజింగ్ ప్రొడక్టులను రన్ చేసేందుకు పేపాల్ మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్కస్ ను నియమించుకుంది. మార్కస్ కూడా కాయిన్ బేసిడ్ డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ లో ఒక భాగమే. స్టేబుల్ కాయిన్స్ కు సంబంధించి క్రిప్టో ప్రాజెక్టులో పనిచేసిన మార్కస్ కు అపారమైన అనుభవం ఉంది. అందుకే ఫేస్ బుక్ డేవిడ్ ను ఎంచుకున్నట్టు రిపోర్ట్ తెలిపింది.

250 కోట్ల యూజర్లు

250 కోట్ల యూజర్లు

ఫేస్ బుక్ కంపెనీకి గ్లోబల్ గా 2.5 బిలియన్లు (250 కోట్లు) యూజర్లు ఉన్నారు. రెగ్యులేటరీ ఇష్యులను నేవిగేట్ చేయడంలో గొప్ప అనుభవంతో పాటు వార్షిక ఆదాయంలో 40 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువగానే వస్తోంది. అందుకే స్థిరమైన కాయిన్ కరెన్సీని స్థిరంగా ఉంచేందుకు ఇదొక సువర్ణావకాశంగా కంపెనీ భావిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టును లాంచ్ చేయబోతున్న మొదటి అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా ఫేస్ బుక్ నిలవనుంది.

లిబ్రా క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?

లిబ్రా క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?

లిబ్రా బ్లాక్ చెయిన్' ఆధారంగా లిబ్రా పని చేస్తుంది. ఇందులో కరెన్సీ యూనిట్ ని 'లిబ్రా' అని పిలుస్తారు. ఈ క్రిప్టోకరెన్సీ 'ఆస్తుల నిల్వకు అంతర్గత విలువ ఇచ్చే విధంగా' పని చేస్తుంది. ఈ కరెన్సీ లిబ్రా అసోసియేషన్ నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనేక ఇతర క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా లిబ్రా నిజమైన ఆస్తుల నిల్వ ఆధారంగా ఉంటుందని ఫేస్ బుక్ తెలిపింది. ఈ లిబ్రా విలువ ఇతర కరెన్సీలు, క్రిప్టోకరెన్సీల మాదిరిగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోను కాకుండా అన్నివేళలా ఇంచుమించు అంతే విలువతో ఉండనుంది.

  క్యాలిబ్రా వ్యాలెట్, ప్రైవసీ

క్యాలిబ్రా వ్యాలెట్, ప్రైవసీ

తమ కొత్త డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా యూజర్ల డబ్బు, సమాచారం భద్రంగా ఉండే విధంగా బలమైన రక్షణతో వస్తున్నట్టు ఫేస్ బుక్ హామీ ఇచ్చింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఉపయోగించే యూజర్ వెరిఫికేషన్, ఇతర చర్యలను ఈ వ్యాలెట్ వినియోగించనుంది. యూజర్లు పాస్ వర్డ్ లు తిరిగి పొందేందుకు, ఫోన్ పోగొట్టుకున్న సందర్భాలలో సహాయపడేందుకు ప్రత్యేకమైన సపోర్ట్ ఉండనుంది. యూజర్ల ఖాతాల్లోకి ఎవరైనా తప్పుదోవలో ప్రవేశిస్తే వారికి కలిగిన నష్టం మొత్తాన్ని తిరిగి ఇస్తామని ఫేస్ బుక్ వాగ్దానం చేస్తోంది. యూజర్ల అనుమతి లేకుండా ఖాతా సమాచారం, ఆర్థిక వివరాలను థర్డ్ పార్టీ సహా ఎవరికీ ఇవ్వబోమని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

 సెంట్రల్‌ బ్యాంకుల నిషేధం

సెంట్రల్‌ బ్యాంకుల నిషేధం

సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ మొదలైనవి) సామాన్య ప్రజానీకం భారీగా నష్టపోయే ప్రమాదముందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫేస్‌బుక్‌ నుంచి క్రిప్టోకరెన్సీ వస్తోందన్న వార్తల నేపథ్యంలో బిట్‌కాయిన్‌ రేటు గణనీయంగా పెరిగింది. 2018 మే తర్వాత తొలిసారిగా 9,000 డాలర్ల స్థాయి పైకి చేరింది.

Best Mobiles in India

English summary
Facebook gets big firms on board! Uber, PayPal, Visa, Mastercard to invest $10 million each in Bitcoin rival Libra

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X