కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, ఫేస్‌బుక్ పైత్యం చూడండి

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన పైత్యాన్ని మరోసారి చూపించుకుంది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఫేస్‌బుక్‌ పేర్కొంది. అయితే వెంటనే పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరానియన్ నెట్‌వర్క్ ద్వార

|

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన పైత్యాన్ని మరోసారి చూపించుకుంది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఫేస్‌బుక్‌ పేర్కొంది. అయితే వెంటనే పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరానియన్ నెట్‌వర్క్ ద్వారా ప్రభావితమైన దేశాలు, ప్రాంతాలు జాబితాలో కశ్మీర్‌ను పొరపాటున చేర్చామని ఫేస్‌బుక్‌ ప్రకటనలో తెలిపింది.

కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, ఫేస్‌బుక్ పైత్యం చూడండి

ఇండియా, ఇండోనేషియా, ఈజిప్టుతో పాటు కశ్మీర్‌నూ దేశంగా పేర్కొంటూ ఓ బ్లాగ్ పోస్టులో జాబితాను పెట్టింది. నెటిజన్లు ఏకిపారేయంతో తప్పుని సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పింది.

 బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో

బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో

ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావించిన బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు దొర్లింది. ఇరాన్‌కు సంబంధించిన బహుళ నెట్‌వర్క్‌లు అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా 513 పేజీలను, గ్రూపులు, ఇతర ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది.

సదరు దేశాల జాబితాలో

సదరు దేశాల జాబితాలో

ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలోంచి కశ్మీర్‌ పేరును చేర్చి ఉండాల్సింది కాదనీ, ఈ గందరగోళానికి క్షమించాలని కోరింది. అలాగే కశ్మీర్‌ పేరును ఈ జాబితాలోంచి తొలగించామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

 

 ఫేస్‌బుక్ పాలసీకి అనుగుణంగా
 

ఫేస్‌బుక్ పాలసీకి అనుగుణంగా

అమెరికా, సౌదీఅరేబియా, ఇజ్రాయెల్ టార్గెట్‌గా పనిచేస్తున్న ఇరాన్ నెట్‌వర్క్ గ్రూప్స్, పేజీలను సైతం తొలగించింది. ఫేస్‌బుక్ పాలసీకి అనుగుణంగా వాటిని తొలగించినట్లు వెల్లడించింది.

ఫేస్‌బుక్‌ లైవ్‌లను

ఫేస్‌బుక్‌ లైవ్‌లను

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా ఫేస్‌బుక్‌ లైవ్‌లను మానిటర్‌ చేయనుంది.

 ప్రత్యక్ష ప్రసారాలను

ప్రత్యక్ష ప్రసారాలను

ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది. అంటే ఇకపై ఫేస్‌బుక్‌ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. క్రైస్ట్‌చర్చ్‌ ఊచకోత సంఘటన లైవ్‌ స్ట్రీమింగ్‌పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌ఫారంపై ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది.

 ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్‌

ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్‌

ఈ మేరకు ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్‌ తన బ్లాగ్‌లో ప్రకటించారు. ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపడి ఆధారఫడి ఫేస్‌బుక్‌లో ఎవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌బుక్‌ పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు.

Best Mobiles in India

English summary
Facebook apologises for mistakenly naming Kashmir a separate country

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X