ఫేస్‌బుక్ అప్లికేషన్స్‌ వెబ్‌సైట్ 'ఏపిపిఫిస్సింగ్.కామ్' విడుదల

Posted By: Staff

ఫేస్‌బుక్ అప్లికేషన్స్‌ వెబ్‌సైట్ 'ఏపిపిఫిస్సింగ్.కామ్' విడుదల

చెన్నై: ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ గురించి పరిచయం అక్కర లేదు. రోజుకి ఇంటర్నెట్లో 20 గంటలు సెర్చింగ్ చేస్తున్నారని అనుకుంటే అందులో 15 గంటలు పాటు ఫేస్‌బుక్ పైనే ఆసక్తి చూపుతున్నారని ఇటీవల ఓ సర్వే ప్రకచించిన సంగతి తెలిసిందే. అలాంటి సామాజిక వెబ్ సైట్ ఫేస్‌బుక్‌కి సంబంధించిన అప్లికేషన్స్‌ని 'ఏపిపిఫిస్సింగ్.కామ్' అనే వెబ్ సైట్ గురువారం(ఆగస్టు 25)న విడుదల చేయడం జరిగింది.

చెన్నై ఆధారిత డెవలప్‌మెంట్ కంపెనీ అయిన 'ఏపిపిఫిస్సింగ్.కామ్' యూజర్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఫేస్‌బుక్ అప్లికేషన్స్‌కి రూపకల్పన చేయడం జరిగింది. వీటిని ఏపిపిఫిస్సింగ్.కామ్ విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే యూజర్స్‌కు ఫేస్‌బుక్‌ని మరింత దగ్గర చేర్చేందుకేనని ఏపిపిఫిస్సింగ్.కామ్‌ని రూపోందించిన సంస్ద జిబూమ్ సిఈవో ప్రదీప్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ అప్లికేషన్స్‌ని ఉపయోగించికొని యూజర్స్ ఫేస్‌బుక్‌కి మరింత చేరువ కావచ్చని తెలిపారు.

ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఈ అప్లికేషన్స్ యొక్క ప్రత్యేకతలను కూడా తెలియజేశారు. ఈ అప్లికేషన్స్‌ని యూజర్స్ ఉపయోగించడం వల్ల వారియొక్క పర్సనల్ ఆసక్తిని, ఇష్టా ఇష్టాలను సన్నిహితులు, స్నేహితులతో పంచుకొవచ్చని తెలిపారు. ఇలాంటి వాటన్నింటిని కూడా ఒకచొటుకి చేర్చి ఏపిపిఫిస్సింగ్.కామ్ ద్వారా యూజర్స్‌కు అందించడం జరుగుతుంది. వీటి రూపకల్పన ద్వారా యూజర్స్ ఆసక్తి ఎటువైపు ఉందనేది చాలా ఈజీగా తెలసిపోతుందని అన్నారు. యూజర్స్‌కు ఇష్టమైన అప్లికేషన్స్‌ని అందించడం కొసం ఏపిపిఫిస్సింగ్.కామ్‌కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది.

ఏపిపిఫిస్సింగ్.కామ్ వెబ్‌సైట్ సమాచారం మీరు ఈ (ఏపిపిఫిస్సింగ్.కామ్)లింక్ లో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot