జులై 6న ఫేస్‌బుక్ పాలో ఆల్టోలో ఫేస్‌బుక్ పండుగ

Posted By: Staff

జులై 6న ఫేస్‌బుక్ పాలో ఆల్టోలో ఫేస్‌బుక్ పండుగ

కాలిఫోర్నియా: జులై 6వ తారీఖు ఫేస్‌బుక్ తన చరిత్రలో ఓ సరిక్రొత్త నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ త్వరలో ఫేస్‌బుక్‌లో చాలా అధ్బుతమైనటువంటి ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రకటించిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్ ఓ ఈవెంట్‌ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్విటేషన్స్ ప్రముఖ మీడియా ఆర్గనైజేషన్స్ అన్నింటికి పంపండం కూడా జరిగింది. ఇక ఈవెంట్ జరిగే తేది జులై 6, బుధవారం.

ఈ మెయిల్ ఇన్విటేషన్ ప్రకారం ఈవెంట్ జరగే ప్రదేశం ఫేస్‌బుక్ పాలో ఆల్టో, కాలిఫోర్నియా, హెడ్ క్వార్టర్స్. ఇంతకీ ఈ ఈవెంట్ ఎందుకనేది ఈ మెయిల్ పొందిన వారందరిలో చర్చనీయాంశం అయింది. ఏది ఐతేనేం సోషల్ నెట్ వర్కింగ్ ప్రపంచం తన పని తాను చేసుకుంటా పోతుంది. టెక్నాలజీ బ్లాగుల ప్రకారం ఫేస్‌బుక్ తన ప్లాట్ ఫామ్‌లో కొన్ని కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరుగుతుందని బోగట్టా. అసలు ఫేస్‌బుక్ ఇంత హాడావుడిగా కొత్త పీచర్స్‌ని యాడ్ చేయడానికి కారణం త్వరలో విడుదలవుతున్న గూగుల్ ప్లస్ నుండి వచ్చే పోటీని తట్టకోవడానికి ముందు జాగ్రత్తగా ఈ ఈవెంట్‌ని పెడుతుందేమోనని నిపుణుల అంచనా.

ఫేస్‌బుక్ కొత్తగా తన ప్లాట్ ఫామ్‌లో పెట్టనున్న ఒకానొక ఫీచర్ ఏమిటంటే వీడియో చాటింగ్. ప్రముఖ ఇంటర్నెట్ వీడియో చాటింగ్ స్కైపీ సహాయంతో ఫేస్‌బుక్ వీడియో చాటింగ్ ఆప్షన్‌ని ఫేస్‌బుక్లో ప్రవేశపెట్టనుందని సమాచారం. త్వరలో విడుదల కానున్న గూగుల్ ప్లస్‌లో వీడియో ఛాటింగ్ ఆప్షన్ బాగా పాపులర్ అవతుందని టెక్నాలజీ బ్లాగులు రాయడంతో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక స్కైపీ సర్వీస్‌ని ఇటీవలే సాప్ట్ వేర్ గెయింట్ మైక్రోసాప్ట్ స్వాధీన పరచుకున్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ విడుదల చేయనున్నటువంటి ఇంకొక కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ అప్లికేషన్ ఆపిల్ ఐప్యాడ్. లాస్ ఏంజిల్స్ టైమ్స్ కదనం ప్రకారం ఫేస్‌బుక్ ఆపిల్ ఐఫోన్స్ సంబంధించి ఫోటో షేరింగ్ అప్లికేషన్‌ని కూడా విడుదల చేయనుందని సమాచారం. గూగుల్ ప్లస్ రాకతో ఫేస్‌బుక్ సోషల్ నెట్ వర్కింగ్ రంగంలో తన నెంబర్ వన్ స్దానాన్ని నిలబెట్టుకోగలదో లేదోనని డైలమాలో పడింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot