మీ వయసు పదమూడా..ఐతే ఫేస్‌బుక్ పేజిలోకి ప్రవేశం లేదు

Posted By: Super

మీ వయసు పదమూడా..ఐతే ఫేస్‌బుక్ పేజిలోకి ప్రవేశం లేదు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్‌ని మెయింటెన్ చేస్తున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇటీవల ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ కఠినమైన నిర్ణయం ఏమిటని అనుకుంటున్నారా..ఫేస్‌బుక్ పేజి నుండి రోజుకి 20,000 మంది చిన్న పిల్లలకు సంబందించినటువంటి ఎకౌంట్‌లను తీసివేస్తుందని టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. దీనికి కారణం వారి యొక్క వయసేనని ఫేస్‌బుక్ ఛీప్ ప్రైవసీ ఎడ్వైజర్ మొజిల్లా ధామ్సన్ అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫేస్‌బుక్ ప్రైవసీ పాలసీ ప్రకారం పదమూడు సంవత్సరాల వయసు లోపుగల వారిని రోజుకి 20,000 మంది చిన్న పిల్లలను ఫేస్‌బుక్ పేజిల నుండి తీసివేస్తున్నామని ప్రకటించారు. దీనికంతటికి కారణం పదమూడు సంవత్సరాల వయసులోపు కలిగినటువంటి పిల్లలు 24 అవర్స్ ఫేస్‌బుక్ వెబ్ సైట్‌ని ఉపయోగించడమేనని అన్నారు. ఇక నుండి పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఫేస్‌బుక్ పేజిలో రిజిస్టర్ అవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. పోరపాటున మీరు గనుక ఫేస్‌బుక్‌లో రిజస్టర్ అయినప్పటికీ వారికి సంబంధించినటువంటి పర్సనల్ ఇన్పర్మేషన్ త్వరలోనే తీసివేయడం జరుగుతుందని అన్నారు. మీరు గనుక పదమూడు సంవత్సరాల లోపు వయసు ఉన్నట్లైతే ఈ పేజి ద్వారా http://www.facebook.com/help/contact.php?show_form=underage ఫేస్‌బుక్ వారిని సంప్రదించాల్సి ఉంటుంది.

పదమూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వారి యొక్క తల్లి దండ్రులు పరిమిషన్ మేరకు ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లి దండ్రులు పిల్లలకు ఇంటర్నెట్‌ని సేఫ్‌గా ఎలా వాడాలో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. వివరాలకు దాని గురించిన సమాచారం ఈ పేజి ద్వారా చూడోచ్చు..http://www.facebook.com/help/?page=937

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot