"మై పర్సనాలిటీ" యాప్ ను తొలగించిన Facebook

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ తర్వాత ఫేస్‌బుక్‌ మరో వివాదంలో చిక్కుకుంది.అయితే, ఈ సారి "మై పర్సనాలిటీ" అనే యాప్ వంతు.

By Anil
|

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ తర్వాత ఫేస్‌బుక్‌ మరో వివాదంలో చిక్కుకుంది.అయితే, ఈ సారి "మై పర్సనాలిటీ" అనే యాప్ వంతు. ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగించడం వలన ఏర్పడే నష్టాలు ఈ యాప్ వల్ల మరోసారి బయటపడ్డాయి.సదరు యాప్ 40 లక్షల మంది వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్‌బుక్ విచారణలో తేలింది . దీంతో "మై పర్సనాలిటీ" యాప్ ను ఫేస్‌బుక్ తొలగించింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే

"మై పర్సనాలిటీ" యాప్....

"మై పర్సనాలిటీ" అనే యాప్‌ను ఫేస్‌బుక్ నుంచి నిషేధిస్తునట్టు ఫేస్‌బుక్ ప్రకటన జారీ చేసింది . వినియోగదారుల సమాచారాన్ని ఇతర కంపెనీలతో పంచుకున్నట్లు మా విచారణలో తేలడం వలన ఈ యాప్ ను తొలిగిస్తునట్టు వివరించింది.

2012కు ముందు బాగా యాక్టివ్‌గా ఉండేది....

2012కు ముందు బాగా యాక్టివ్‌గా ఉండేది....

ఈ యాప్ 2007సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు యాక్టివ్‌గా ఉండేది, ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది వినియోగదారుల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది.

ఇప్పటికే ఆ యూజర్లకు సమాచారాన్ని....

ఇప్పటికే ఆ యూజర్లకు సమాచారాన్ని....

అయితే, ఇప్పటికే ఆ యూజర్లకు ఈ సమాచారాన్ని తెలియజేసినట్లు కూడా చెప్పింది. ఆ వినియోగదారుల ఫ్రెండ్స్ సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేసారా లేదా అన్న విషయంపై తమకు ఇంకా స్పష్టత లేదని, కాబట్టి ప్రస్తుతానికి వాళ్లకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

థర్డ్ పార్టీ యాప్స్‌పై ఫేస్‌బుక్ జరిపిన విచారణలో.....

థర్డ్ పార్టీ యాప్స్‌పై ఫేస్‌బుక్ జరిపిన విచారణలో.....

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్‌పై ఫేస్‌బుక్ జరిపిన విచారణలో అనుమానాస్పదంగా అనిపించిన సుమారు 400 యాప్‌లను తొలిగించినట్లు పేర్కొన్నారు. యాప్‌లపై విచారణ కొనసాగిస్తూనే ఉంటామని కూడా ఫేస్‌బుక్ పేర్కొంది.

ఈ యాప్ ను Cambridge Psychometrics Centre క్రియెట్ చేసింది....

ఈ యాప్ ను Cambridge Psychometrics Centre క్రియెట్ చేసింది....

ఈ యాప్ ను Cambridge Psychometrics Centre క్రియెట్ చేసింది.అయితే దీనికి కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ "మై పర్సనాలిటీ" యాప్ 2007 నుంచి 2012 వరకు బాగా యాక్టివ్‌గా ఉండేది.personality quizzes ద్వారా యూజర్ల డేటాను తీసుకోగలిగారు .దాదాపు నాలుగు మిలియన్ల యూజర్ల డేటాను సేకరించడంలో విజయవంతమైంది.

Best Mobiles in India

English summary
Facebook bans controversial myPersonality app, 400 others in crackdown.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X