గూగుల్ ప్లస్ పోటీని తట్టుకునేందుకు ఫేస్‌బుక్ కొత్త ఎత్తు

Posted By: Staff

గూగుల్ ప్లస్ పోటీని తట్టుకునేందుకు ఫేస్‌బుక్ కొత్త ఎత్తు

శాన్ ఫ్రాన్సికో: నిన్నటి వరకు సోషల్ నెట్ వర్కింగ్ రంగంలో తిరుగు లేని రారాజుగా వెలుగొందిన ఫేస్‌బుక్‌కి ఇప్పుడు గూగుల్ ప్లస్ రూపంలో చిన్న ఎదురు దెబ్బ తగిలే అనుమానం రావడంతో ఫేస్‌బుక్ తన నెంబర్ వన్ స్దానాన్ని కాపాడడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నం స్కైపీ వీడియో చాటింగ్. ఫేస్‌బుక్ కొత్తగా తన ఫ్లాట్ మీదకి ఇంటర్నెట్ వీడియో నెంబర్ వన్ అయినటువంటి స్కైపీని వీడియోని ఫేస్‌బుక్‌లో వినియోగించుకోనుంది.

ఈ విషయాన్ని ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ టెక్ క్రంచ్ తన బ్లాగ్‌లో స్వయంగా వెల్లడించింది. అందులోని కధనం ప్రకారం ఫేస్‌బుక్ త్వరలో స్కైపీ వీడియో చాటింగ్ ప్రోడక్ట్‌ని విడుదల చేయనుందని తెలిపింది. ఈ విషయంపై ఫేస్‌బుక్ డెషిషన్ టీమ్ స్కైపీతో మంతనాలు జరపడం కూడా జరిగింది. అసలు ఫేస్‌బుక్ ఇంత అర్జెంటుగా వీడియో ఛాటింగ్ అఫ్లికేషన్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం గూగుల్ కొత్తగా విడుదల చేయబోతున్న సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌లో ఒకేసారి పది మందితో వీడియో ఛాటింగ్ చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందంట.

ఇక ఫేస్‌బుక్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 700మిలియన్ యూజర్లు ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ అభివృద్ది రేటు తగ్గుతూ వస్తుంది. ఇటువంటి సమయంలో గూగుల్ ప్లస్ నుండి పోటీని తట్టుకోవడానికి ప్రత్నానమయ పద్దతులను ఫేస్‌బుక్ కనిపెడుతుంది. అంతేకాకుండా త్వరలో విడుదల కానున్న గూగుల్ ప్లస్‌కి పలు రకాల టెక్నాలజీ బ్లాగులు ఎక్సలెన్సీ సర్టిఫికెట్‌ని ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఫేస్‌బుక్ సిఈవో జూకర్స్ బర్గ్ గూగుల్ ప్లస్ విడుదలను విని కొంచెం ఇబ్బంది పడడం కూడా జరిగింది. అది మాత్రమే కాకుండా వచ్చేవారంలో ఫేస్‌బుక్లో కొన్ని కొత్త ఫీచర్స్‌ని కూడా అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot