2098 నాటికి ‘ఫేస్‌‌బుక్ అతిపెద్ద స్మశానం’

Written By:

2098 నాటికి ఫేస్‌బుక్ అతిపెద్ద వర్చువల్ స్మశానవాటికి కానుందని రిసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ శతాబ్ధం ముగింపు నాటికి ఫేస్‌బుక్‌లో లైవ్ ప్రొఫైల్స్‌తో పోలిస్తే డెడ్ ప్రొఫైల్స్ ఎక్కువుగా ఉంటాయని వీరు చెబుతున్నారు. చనిపోయిన యూజర్లకు సంబంధించిన అకౌంట్ లను డిలీట్ చేసేందుకు నిరాకరిస్తోన్న ఫేస్ బుక్ వాటిని "memorialized" వర్షన్ లుగా మార్చేస్తోంది.

Read More : స్మార్ట్‌ఫోన్ 3డీ ప్రింటర్‌లా మారిపోతుంది

2098 నాటికి ‘ఫేస్‌‌బుక్ అతిపెద్ద స్మశానం’

బ్లాగింగ్ కంపెనీ డిజిటల్ బియాండ్ చెబుతోన్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మరణించే ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య దాదాపుగా 9,70,000 ఉండొచ్చట. 2010లో ఈ సంఖ్య 3,85,968గా ఉండగా, 2012లో 5,80,000గా ఉంది. మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్‌వర్క్ ఇదే విధంగా కొనసాగిస్తే సంస్థ వృద్ధి రేటు సైతం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు మసాచుసెట్స్ విశ్వవిద్యాలయ పీహెచ్‌డి అభ్యర్థి సాదిక్కీ.

2098 నాటికి ‘ఫేస్‌‌బుక్ అతిపెద్ద స్మశానం’

కమ్యూనికేషన్ అవసరాల రిత్యా ఫేస్‌బుక్, జీమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అనేక వెబ్ ఆధారిత అప్లికేషన్‌లకు సంబంధించి ఆన్‌లైన్ అకౌంట్‌లను నిర్వహించుకుంటున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు జీవనశైలిని పూర్తిగా మార్చేసాయి. మనం మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమైపోతాయ్..?, వాటి ఎవరు నిర్వహిస్తారు..? ఇలాంటి సందేహాలు మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తమై ఉండొచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ అనేది వ్యక్తికి సంబంధించి పూర్తిగా వ్యక్తగతం. ఐడీ ఇంకా పాస్‌వర్డ్ తెలిస్తే తప్ప వేరొకరు మన అకౌంట్‌లను ఓపెన్ చేయలేరు. మరణించిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట్‌లను ఏ విధంగా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం...

Read More : ప్రపంచ వింతలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

ఫేస్‌బుక్‌లో రెండు ఆప్షన్‌లు మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీల్ చేసేందుకు ఫేస్‌బుక్‌లో రెండు ఆప్షన్‌లు ఉన్నాయి. మొదటిది, మరణించిన యూజర్‌కు సంబంధించిన అకౌంట్‌ను స్మారక పేజీగా మార్చుకోవచ్చు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ఈ అకౌంట్‌ను సెక్యూర్ చేసేందుకు అదనపు చర్యలు తీసుకుంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరిణించిన వ్యక్తికి సంబంధించిన గూగుల్ ఇంకా జీమెయిల్ అకౌంట్ వివరాలను ఆ వ్యక్తి తరుపు ‘‘అధికార ప్రతినిధికి'' గూగుల్ అందజేస్తుంది. మరిన్నివివరాల కోసం క్లిక్ చేయండి

 

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరణించిన యూజర్‌కు సంబంధించి ట్విట్టర్ అకౌంట్‌‍కు సంబంధించిన యాక్సెస్‌ను ఎవ్వరికి ఇవ్వబోమని ట్విట్టర్ స్ఫష్టం చేసింది. అయితే, మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ట్విట్టర్‌ను రిక్వస్ట్ చేయటం ద్వారా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తారు.

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్ వివరాలను ఎవ్వరికి ఇవ్వబోమని పింటరెస్ట్ వెల్లడించింది. మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఈమెయిల్ ద్వారా సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లయితే అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తామని పింటరెస్ట్ నిబంధనులు చెబెతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరణించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను క్లోజ్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌ను రిక్వస్ట్ చేయటం ద్వారా సదరు అకౌంట్‌ను క్లోజ్ చేసేస్తారు. 

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరణించిన యాహూ అకౌంట్ యూజర్‌కు సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి తాలూకా అధికార ప్రతినిధి యాహూ దృష్టికి మెయిల్, ఫాక్స్, ఈమెయిల్‌కు రిక్వస్ట్ లెటర్‌తో పంపవల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

https://help.yahoo.com/kb/SLN9112.html?impressions=true

 

మరణించిన వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లను డీల్ చేయటం ఎలా..?

మరణించిన వ్యక్తికి సంబంధించిన పేపాల్ అకౌంట్‌ను క్లోజ్ చేయాలంటే సంబంధిత సమాచారాన్ని ఫ్యాక్స్ రూపంలో పంపవల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook to become world’s biggest virtual graveyard by 2098: Survey. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot