చైనా వల్ల ఫేస్‌బుక్ 'బ్లూ' కాస్త 'రెడ్' గా మారనుందా?

Posted By: Staff

చైనా వల్ల ఫేస్‌బుక్ 'బ్లూ' కాస్త 'రెడ్' గా మారనుందా?

బిజీంగ్: చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫేస్‌బుక్, గూగుల్ లాంటి వాటిని తమ దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. ఐతే లెటేస్ట్ ఇన్పర్మేషన్ ప్రకారం చైనా కమ్యూనిస్ట్ గవర్నమంట్ ప్రపంచంలో అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌‌లో ఎక్కువ శాతం వాటాని కొనుగోలు చేయనుందని సమాచారం. ఇలా చేయడం వల్ల ఫేస్‌బుక్ చైనా పరం కానుంది. వివరాలలోకి వెళితే చైనా సావనీర్ వెల్త్ ఫండ్(చైనా ఇన్విస్టిమెంట్ కార్పోరేషన్) మాజీ ఫేస్‌బుక్ ఎంప్లాయస్‌ని సంప్రదించి వారియొక్క కంపెనీ స్టాక్స్‌ని కొనుగోలు చేయనుందని తెలిపారు.

దీనితోపాటు సిటి బ్యాంక్ కూడా ఫేస్‌బుక్ స్టాక్స్‌లో $1.2 బిలియన్ విలువ కలిగినటువంటి రెండు సావనీర్ వెల్త్ ఫండ్స్‌ని స్వాధీనం చేసుకొవడానికి సిద్దపడినట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి ఫేస్‌బుక్‌లో 700మంది మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇక చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దాదాపు చైనాలో 400మిలియన్ జనాభా ఇంటర్నెట్ యూజర్స్‌ని బ్లాక్ చేసింది. దీనిని బట్టి చైనా ప్రజలు ఫేస్‌బుక్‌లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ తన బిజినెస్‌ని చైనాకి కూడా విస్తరించాలని చాలా సార్లు చైనా గవర్నమెంట్‌ని ఆశ్రయించడం జరిగింది.

ఇక ఫేస్‌బుక్‌ని చైనా కొనుగోలు చేయనుందని వచ్చిన రూమర్ తెలిసిన యూజర్స్ చాలా మంది సంతోషంగా లేరు. చైనా చేతిలోకి గనుక ఫేస్‌బుక్ వెళితే ఇక ఫేస్‌బుక్ పని అయిపోనట్లేనని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot