పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..?

Written By:

పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..? అని అశ్చర్యపోకండి నిజమే మరి. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్కు పాప జన్మించి ఇంకా నెల రోజులైనా కాలేదు అప్పుడే ఆ బుజ్జాయికి చదువు నేర్పిస్తున్నాడు. జుకర్ బర్గ్, భార్య ప్రిసిల్లా ఛాన్ దంపతులు తమ పాపకు ఓ పుస్తకాన్ని చదివి విన్పిస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..?

పుస్తక ప్రియులకు ఫేస్బుక్ ద్వారా నిర్వహించే చర్చల కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది బుక్స్ లిస్ట్లో 'క్వాంటమ్ ఫిజిక్స్ ఫర్ బేబీస్' ఉంచబోతున్నట్లు చెబుతూ ఆ ఫొటోను జుకర్ బర్గ్ పోస్ట్ చేశాడు. చిన్న పిల్లలకు.. క్వాంటమ్ ఫిజిక్స్లోని ప్రాథమిక భావనలు అవగాహన చేసుకోవడానికి చిన్న చిన్న పదాలు,బొమ్మలతో కూడిన ఆ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.

పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..?

అయితే జుకర్ బర్గ్ తమాషాగా చెబుతున్నాను అని వివరణ ఇచ్చాడు. వాస్తవానికి హెన్రీ కిసింజర్ రాసిన 'వరల్డ్ ఆర్డర్' పుస్తకాన్ని ఆయన రికమండ్ చేశారు. దీనిపై బర్గ్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాల్సిన అవసరం ఉంది.

పుట్టి నెల కూడా కాలేదు.. అప్పుడే చదువా..?

ప్రశాంతత కూడిన వాతావరణాన్ని మనం పిల్లలకు అందించాలి అని తెలిపారు. అయితే రాబోయే సంవత్సరం పిల్లలకు సంబంధించిన పుస్తకాలను రికమండ్ చేయనున్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు.

Read more about:
English summary
Here Write Mark Zuckerberg is already reading his baby books about quantum physics
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot