భారత్‌లో ఫేస్‌బుక్ దూకుడు

భారత్‌లో తమ యూజర్ల సంఖ్య ఈ ఏడాది సెప్టంబర్ నాటికి 11.2 కోట్లకు పెరిగిందని ఫేస్‌బుక్ వెల్లడించింది. తమకు అత్యధిక యూజర్ బేస్‌ను కలిగి ఉన్న దేశాల్లో అమెరికా తరువాతి స్థానాన్ని భారత్ దక్కించుకుందని ఫేస్‌బుక్ ఇండియా ఎండీ కీర్తిగా రెడ్డి తెలిపారు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఇంటర్నెట్ విస్తరణ, యువత అత్యధికంగా స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించటం వంటి అంశాలు ఈ ఎదుగుదలకు దోహదపడ్డాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 135 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వారిలో డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 86.4 కోట్లని తెలిపారు.
భారత్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న 112 మిలియన్‌ల మంది యూజర్లలో 99 మిలియన్ల మంది తమ ఫోన్‌ల నెలకు ఒకసారైన ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారని, 4.5 కోట్ల మంది యూజర్లు ద్వారా ప్రతి రోజూ ఫేస్‌బుక్‌కు కనెక్ట్ అవుతున్నారని కీర్తిగా రెడ్డి వివరించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








