చైనాలో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉన్నాం: ఫేస్‌బుక్‌ సివోవో

Posted By: Super

చైనాలో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉన్నాం: ఫేస్‌బుక్‌ సివోవో

ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్‌బర్గ్ రెండవ సారి చైనాకి వెళ్శడం వెనుక పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైనటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ఫేస్‌బుక్‌ని విస్తరించే దిశలో చైనా వెళ్శడం జరిగిందని అనుకుంటున్నారు. చైనాలోకి గనుక ఫేస్‌బుక్ అడుగు పెడితే ప్రపంచంలో కెల్లా పెద్దదైన ఇంటర్నెట్ పాపులేషన్‌గా అవతారం ఎత్తడానికి అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం ప్రపంచంలో మొత్తం మీద ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం చైనా మాత్రమే కాబట్టి.

ఈ సందర్బంలో ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్, సివోవో శ్రేయల్ శాండ్‌బర్గ్ ఇద్దరూ చైనాలోకి ఎలాగైనా ఫేస్‌బుక్‌ని తీసుకోని వెళ్శాలనే ధృడ నిశ్చియంతో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా చైనాలో ఫేస్‌బుక్‌ని తీసుకోని వెళ్శడానికి ముఖ్యకారణాలను కూడా వెల్లడించారు. మా కంపెనీ మిషన్ చాలా క్లియర్ ఉంది. మా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఫేస్‌బుక్‌తో యావత్ ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చెయ్యాలనేది. అందులో భాగంగా చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాం.

ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోల్చితే చైనాలో అతి పెద్ద ఇంటర్నెట్ మార్కెట్ ఉంది. ఇక ఇంటర్నెట్ యూజర్ల విషయానికి వస్తే కూడా చాలా అధికం. ఫేస్‌బుక్‌ని చైనా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ సిఈవో గత డిసెంబర్‌లో చైనాకి వచ్చినప్పుడు చైనాలో ఇంటర్నెట్ కంపెనీలు అయిన బైదు, సినా, ఆలీబాబాతో మాట్లాడడం మాత్రమే కాకుండా వాటితో ఇంటర్నెట్ సంబంధాన్ని కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot