భారత్‌లో ఫేస్‌బుక్‌ని నెలకు 1గంట 50 నిమిషాలు వాడుతున్నారు

Posted By: Staff

భారత్‌లో ఫేస్‌బుక్‌ని నెలకు 1గంట 50 నిమిషాలు వాడుతున్నారు

ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్దదైన సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ గురువారం అంటే ఏప్రిల్ 28వ తారీఖున ఇండియా ఫేస్‌బుక్ జనాభా 25మిలియన్ యూజర్స్‌ని దాటిందని వెల్లిడంచారు. ఫేస్‌బుక్ అఫీసియల్స్ ప్రకారం ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌నని అంటున్నారు. గుర్గావ్‌లో యాడ్ టెక్‌లో జరిగినటువంటి టెక్నాలజీ ఎడ్వర్టైజింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చినటువంటి ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఆపరేషన్స్ డేవిడ్ ఫిచ్చర్ మాట్లాడుతూ ఇండియన్స్‌తో ఫేస్‌బుక్ చాలా ధృడమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తుందని తెలిపారు.

సోషల్ వెబ్‌లో ఫేస్‌బుక్ వాల్యూ పెంచేటటువంటి డవలపర్స్, ఔత్సాహికులు కోసం ఇండియాలో మేము చూడడం జరుగుతుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఇండియన్స్‌తో గట్టి బంధాన్ని కూడా ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నట్లు డేవిడ్ ఫిచ్చర్ తెలిపారు. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి కొన్ని ట్రాఫిక్ డిటేల్స్‌ని కూడా డేవిడ్ ఫిచ్చర్ వెల్లడించడం జిరిగింది. ప్రపంచం మొత్తం మీద ఫేస్‌బుక్ యూజర్స్ దాదాపు 600మిలియన్ జనాభా ఉన్నారని అన్నారు. ఇండియన్ ఫేస్‌బుక్‌లో యాజరేజిగా ప్రతి మనిషి ఫేస్‌బుక్‌లో గడిపేటటువంటి సమయం నెలకు మూడు గంటలని తెలియజేశారు.

ఇక మిగతా వెబ్ సైట్స్ అయినటువంటి గూగుల్, యూట్యూబ్ విషయానికి వస్తే గూగుల్‌ని యావరేజిగా సగటు భారతీయుడు నెలకు 1గంట 50 నిమిషాలు వాడుతున్నట్లు, అదేవిధంగా యూట్యూబ్ విషయానికి వస్తే నెలకు సగటు భారతీయుడు నెలకు 1గంట 20నిమిషాలు వాడుతున్నట్లు తెలిసింది. ఇది తక్కువ సమయంలో ఫేస్‌బుక్ సాధించినటువంటి విజయంగా అభివర్ణించవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot