ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది
టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని అన్వేషిస్తున్న ఫేస్‌బుక్, కొత్త బ్లాక్ చెయిన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు రిపోర్టులు వచ్చాయి.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఈ టెక్నాలజీ ఆధారిత అవకాశాలను అన్వేషించే బాధ్యతల్ని వారికి అప్పగించినట్టు, ఈ విషయంలో ఫేస్‌బుక్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు కథనాలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

2020 నాటికి
తాజాగా వస్తున్న రూమర్ల ప్రకారం 2020 నాటికి ఫేస్‌బుక్ సొంతంగా క్రిప్టోకరెన్సీని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం యూజర్లు ఎటువంటి ఛార్జీలు లేకుండా అంతర్జాతీయంగా లావాదేవీలు నడపవచ్చు. ఆ విధంగా ఆన్ లైన్ సిస్టంను ఫేస్‌బుక్ తీసుకురానుంది. కాగా జూన్ లో ఈ ప్రాజెక్ట్ మీద ఫేస్‌బుక్ విశ్లేషణ చేయనుందని పెట్టుబడిదారులకు దీని గురించి వివరించనుందని ప్రముఖ డిజిటల్ మీడియా టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది.

మార్కెట్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం
జర్మన్ మ్యాగజైన్ WirtschaftsWoche ఈ విషయాన్ని ధృవీకరించింది. రానున్న ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని డాలర్ కన్నా అమితవేగంతో దూసుకుపోతుందని బిట్ కాయిన్ లాంటి వాటికి కూడా సవాల్ విసురుతుందని చెబుతోంది. దీని ఆపరేట్ చేసేందుకు కంపెనీల నుంచి భారీగానే ఛార్జ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

10 మిల్లియన్ డాలర్లు
ఈ లైసెన్స్ పొందడానికి కంపెనీలకు దాదాపు 10మిల్లియన్ డాలర్లు అవసరమవుతాయని ఇందులో ఫేస్‌బుక్ 1 మిల్లియన్ డాలర్ వరకు తోడ్పాటు అందిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. వీరందరినీ క్రిప్టోకరెన్సీ వైపు మళ్లించేందుకు ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

స్విస్ కంపెనీ వ్యూహాం
ఐర్లాండ్ లోని Facebook Global Holdings II లో ఫేస్ బుక్ సొంతంగా ఓ కంపెనీని నిర్వహిస్తోంది. Handelszeitung దాని పేరు. ఈ కంపెనీ ఇప్పుడు కరెన్సీ రిలేటెడ్ పనుల మీద శరవేగంగా ముందుకెళుతోంది. payments, blockchain, analytics, big data and identity management వంటి వాటిల్లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ను పకడ్బందీగా తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిని The New York Times పత్రిక కూడా ధృవీకరించింది. వాట్సప్ మెసేజింగ్ సర్వీసు ద్వారా విర్చువల్ కరెన్సీని Facebook తీసుకురానుందని ఈ మీడియా రిపోర్ట్ చేసింది.

స్పందిచని Facebook
అన్ని మీడియాలు ఈ విషయాన్ని రుజువలతో సహా ప్రచురించగా ఫేస్ బుక్ మాత్రం ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించింది. గతంలో క్రిప్టోకరెన్సీని లాంచ్ చేసి, బిట్‌కాయిన్ తరహాలో వర్చ్యువల్ కరెన్సీ ద్వారా పేమెంట్లు జరిపేలా అనుమతి ఇవ్వనుంది.ఫేస్‌బుక్‌లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని అన్వేషించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశామని ఫేస్‌బుక్ మెసెంజర్ ఎగ్జిక్యూటివ్ ఇంఛార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు.

బ్లాక్‌చెయిన్ టీమ్
ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు అన్వేషిస్తుందని కంపెనీ సైతం ప్రకటించింది. తాము ఏర్పాటు చేసిన చిన్న టీమ్ భిన్నమైన అప్లికేషన్లను అన్వేషించడంపై దృష్టి పెట్టనుందని ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది .బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై పనిచేసేందుకు ఫేస్‌బుక్ కొత్త టీమ్‌ను అభివృద్ధి చేసిందని రీకోడ్ కూడా రిపోర్టు చేసింది. న్యూ ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్రా కింద ఈ బ్లాక్‌చెయిన్ టీమ్ వస్తోంది. దీన్ని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ నడిపించనున్నారు. ష్రోఫెర్‌నే ఫేస్‌బుక్ ఏఆర్, వీఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కార్యకలాపాలను చూసుకోనున్నారు.


Click it and Unblock the Notifications