ఫేస్‌బుక్ డేటింగ్ సీక్రెట్ క్రష్ అంత సురక్షితం కాదు !

సోషల్ మీడియాలో దూసుకపోతున్న ఫేస్‌బుక్ కొత్త ప్రయోగాలతో యూజర్లను కట్టిపడేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తన ఫ్లాట్ ఫాం ద్వారా కొత్త ఫీచర్లను జోడించి ఎలాగైనా పోయిన పేరును తిరిగి నిలబెట్టుకోవాలని వ

|

సోషల్ మీడియాలో దూసుకపోతున్న ఫేస్‌బుక్ కొత్త ప్రయోగాలతో యూజర్లను కట్టిపడేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తన ఫ్లాట్ ఫాం ద్వారా కొత్త ఫీచర్లను జోడించి ఎలాగైనా పోయిన పేరును తిరిగి నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. డేటా స్కాండల్ వ్యవహారంతో తీరిని అప్రతిష్టను మూటగట్టుకున్న ఫేస్‌బుక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వినియోగదారుల ప్రైవసీకి ఫేస్‌బుక్లో ఎటువంటి రక్షణ లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ Secret Crush పేరుతో మార్కెట్లోకి డేటింగ్ యాప్ ను తీసుకొస్తోంది.

ఫేస్‌బుక్ డేటింగ్ సీక్రెట్ క్రష్ అంత సురక్షితం కాదు !

అయితే ఈ యాప్ వినియోగదారులను ఆకట్టుకుంటుందో లేదో తెలియదు కాని అప్పుడే దాని ప్రైవసీ మీద విమర్శలు మొదలయ్యాయి. డేటింగ్ యాప్ ని ఓ సారి పరిశీలిస్తే..

సీక్రెట్ క్రష్ పేరుతో

సీక్రెట్ క్రష్ పేరుతో

టిండర్‌ విజయంతో ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై సీక్రెట్ డేటింగ్ సర్వీసులు ప్రారంభించింది. సీక్రెట్ క్రష్ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. కాగా కంపెనీ తన వార్షిక డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది.

20 కోట్ల మంది సింగిల్స్

20 కోట్ల మంది సింగిల్స్

తమ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 20 కోట్ల మంది సింగిల్స్ ఉన్నారని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.టిండర్‌లో డేటింగ్ సర్వీసులు పొందాలంటే 30 డాలర్లు (దాదాపు రూ.2,000) చెల్లించాలి. ఇదే ఫీచర్ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి వస్తే చాలా మంది ఈ సేవలను ఉపయోగించే అవకాశముందిని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అంత సేఫ్టీ కాదనే వాదనలు

అంత సేఫ్టీ కాదనే వాదనలు

ఆయితే ఇది ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కునేందుకు సిద్ధమైంది. ఇది అంత సేఫ్టీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దీని వల్ల చోరికి గురయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ఛాటింగ్ మొత్తం లీకయితే ఆ తరువాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. దీనిని ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ ప్రైవసీ మీద అనే విమర్శలు రావడమేనని తెలుస్తోంది.

మే 1 నుంచి సింగపూర్‌లో

మే 1 నుంచి సింగపూర్‌లో

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ డేటింగ్ సేవలు మే 1 నుంచి సింగపూర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీసుల్లో యూజర్లు వారి కమ్యూనిటీలు, గ్రూప్స్, ఫ్రెండ్స్‌లో భాగస్వామి వెత్తుకోవచ్చు. మీ అభిప్రాయాలకు మ్యాచ్ అయ్యేవారితో చాట్ చేయవచ్చు. కలవొచ్చు. త్వరలోనే ఈ సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి రావొచ్చని సమాచారం.

డేటింగ్ అనే ప్రత్యేకమైన సెక్షన్

డేటింగ్ అనే ప్రత్యేకమైన సెక్షన్

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్ రూపంలో డేటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. డేటింగ్ అనే ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది. ఈ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తే సరిపోతుంది. లేదంటే మీ ప్రొఫైల్‌లో హార్ట్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసి ఈ సేవలు పొందొచ్చు. ఇక్కడ మీరు ప్రత్యేకమైన డేటింగ్ ప్రొఫైల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కు ఎవరికీ కనిపించదు.

నచ్చిన 9 మందిని యాడ్

నచ్చిన 9 మందిని యాడ్

ఇందులో సీక్రెట్ క్రష్ అనే ఫీచర్ ఉంటుంది. ఇందులో మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో నుంచి నచ్చిన 9 మందిని యాడ్ చేసుకోవచ్చు. మీలాగే అవతలి వారు కూడా 9 మందిని సీక్రెట్ క్రష్‌లను యాడ్ చేసుకునే అవకాశముంటుంది. దీని ద్వారా ఛాటింగ్ చేసుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను మరొకరు షేర్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English summary
Facebook’s new ‘Secret Crush’ isn’t cute, it’s creepy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X