కొత్త లుక్‌తో రానున్న ఫేస్‌బుక్, బ్లూకి వీడ్కోలు దిశగా...
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్‌బీ5’గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఎఫ్8 పేరిట నిర్వహిస్త
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్‌బీ5’గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఎఫ్8 పేరిట నిర్వహిస్తున్న వార్షిక టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. కొత్త డిజైన్ పనితీరు మరింత సులభతరంగా, వేగవంతంగా ఉంటుందని, దీన్ని ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నామన్నారు. ఫేస్‌బుక్ యాప్‌లో ఈ మార్పులు తక్షణం కనిపిస్తాయని, మరికొద్ది నెలల్లో డెస్క్‌టాప్ సైట్‌లో కూడా వీటిని చూడొచ్చన్నారు. ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీసుల్లో సీక్రెట్ క్రష్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని జుకర్‌బర్గ్ చెప్పారు.

వినియోగదారుల సమాచార గోప్యతను కాపాడే విషయంలో ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు అంత మంచి పేరు లేదని జుకర్‌బర్గ్ అంగీకరించారు. అయితే, భవిష్యత్తు అంతా గోప్యతదేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో అంతా చిన్న గ్రూపులు, కమ్యూనిటీల్లో మాట్లాడుకునేందుకే ఆసక్తి చూపిస్తారని చెప్పారు.ఒక్క రాత్రిలో అంతా జరిగిపోదు. నిజం చెప్పాలంటే, ఈ ప్రశ్నలన్నింటికీ మన దగ్గర సమాధానాలు లేవు'' అని ఆయన అన్నారు.

బ్లూ డిజైన్
సంస్థ ప్రారంభం నుంచి ఉన్నబ్లూ రంగు డిజైన్‌కూ సంస్థ వీడ్కోలు పలుకనుందని తెలుస్తోంది.అలాగే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సహా వివిధ వేదికల్లోనూ అనేక మార్పులు రానున్నాయి.ఫేస్‌బుక్ డెవలపర్ల సదస్సులో సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

గోప్యతకు ప్రథమ ప్రాధాన్యం
గోప్యతకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందని, సంస్థ పనితీరులో ఇదో పెద్ద మార్పు అని ఆయన తెలిపారు. వినియోగదారుల సమాచార భద్రత విషయంలో సంస్థపై వస్తున్న విమర్శలకు స్పందనగా కొన్ని కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులను జుకర్‌బర్గ్ ప్రకటించారు.

14 దేశాల్లో ..
కొత్తగా బ్రెజిల్, మలేషియా తదితర 14 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. అయితే ఈ జాబితాలో భారత్ లేదు. దీంతో పాటు మెసెంజర్ యాప్‌ను కూడా తేలికగా, వేగవంతంగా మారుస్తున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు.

వాట్సప్ పేమెంట్స్ ఫీచర్
భారత్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఈ ఏడాది ఆఖరు నాటికి ఇతర దేశాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ప్రైవసీ, డేటా భద్రతపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జకర్‌బర్గ్ చెప్పారు.

సీక్రెట్ క్రష్
ఫేస్‌బుక్ డేటింగ్'లో భాగంగా తీసుకువచ్చే 'సీక్రెట్ క్రష్' అనే కొత్త ఫీచర్‌ను సంస్థ ప్రకటించింది. తనకు నచ్చిన తొమ్మిది మందిని సీక్రెట్ క్రష్ జాబితాగా యూజర్ ఎంచుకోవచ్చు. ఆ జాబితాలో ఉన్నవారు ఎంచుకున్న తొమ్మిది మందిలో ఒకవేళ ఈ యూజర్ కూడా ఉంటే.. అప్పుడు ఒకరి పట్ల మరొకరికి ఆసక్తి ఉన్నట్లు తెలుపుతూ ఆ ఇద్దరికీ సందేశం వస్తుంది.

వీఆర్ హెడ్‌సెట్
ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్ సహా 14 దేశాల్లో ఫేస్‌బుక్ డేటింగ్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతం యూరోప్, యూఎస్‌లలో అందుబాటులో లేదు.కంప్యూటర్, ఫోన్, గేమింగ్ కన్సోల్‌లతో కనెక్ట్ అవ్వకుండా విడిగానే పనిచేసే ఆక్యులస్ క్వెస్ట్ అనే వీఆర్ హెడ్‌సెట్‌ను మే 21 నుంచి విక్రయించనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

కఠిన చర్యలు తప్పవంటూ
ఎన్నికల వేళ అనుచిత విధానాలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








