నకిలీ అకౌంట్ల ఏరివేతపై దృష్టి పెట్టిన ఫేస్‌బుక్

|

ఫేస్‌బుక్ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గల మధ్య కాలంలో సుమారు 3.2 బిలియన్ల నకిలీ అకౌంట్ లను తన సర్వీస్ నుండి తొలగించింది. నకిలీ అకౌంట్ల జాబితా గత ఆరు నెలల్లో 3 బిలియన్ల నుండి స్వల్పంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇదే కాలంలో నకిలీ అకౌంట్ల సంఖ్య తొలగించబడిన వాటిలో సుమారు 1.55 బిలియన్ అకౌంట్లు అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

 

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ సంస్థ యొక్క ప్రముఖ ఫోటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్ గా ఉంది. ఇందులో నుండి కూడా ఎన్ని పోస్టులను తొలగించారో మొదటిసారిగా వెల్లడించింది. ఇందులో తప్పుడు వార్తల గురించి ప్రచారం చేస్తున్న వారి పోస్టులను తొలగించినట్లు పరిశోధకులచే గుర్తించబడింది.

 

ఫేస్‌బుక్ నోటిఫికేషన్లతో విసుగొస్తోందా ..? ఈ కొత్త ఫీచర్ ట్రై చేయండిఫేస్‌బుక్ నోటిఫికేషన్లతో విసుగొస్తోందా ..? ఈ కొత్త ఫీచర్ ట్రై చేయండి

ఇన్‌స్టాగ్రామ్‌లో

అంతేకాకుండా ఈ కాలంలో 11.4 మిలియన్ల విద్వేషపూరిత సంభాషణలను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. కొంతమంది ఉగ్రవాద కంటెంట్, పిల్లల దోపిడీ మరియు ఇతర విషయాలతో ద్వేషపూరిత సంభాషణను ముందుగానే తొలగించడం ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్ యొక్క ప్రధాన యాప్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని అన్ని వర్గాలలో ఉల్లంఘించిన కంటెంట్‌ను చురుకుగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీ ప్రారంభంలో అనేక డిటెక్షన్ సాధనాలను అమలు చేసింది. ఇప్పుడు సంస్థ తన నాలుగవ కంటెంట్ మోడరేషన్ నివేదికలో తెలిపింది.

 

వాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడంవాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడం

ఫేస్‌బుక్‌లో
 

ఉగ్రవాద సంస్థలతో అనుబంధించబడిన కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో 98.5% మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 92.2% ఉన్నట్లు ముందుగానే కనుగొన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది మూడవ త్రైమాసికంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నత్వం మరియు పిల్లల లైంగిక దోపిడీని వర్ణించే 11.6 మిలియన్లకు పైగా కంటెంట్లను మరియు 754,000 ఫేస్బుక్ కంటెంట్లను కూడా తొలగించింది.

 

గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?

ఫేస్బుక్

ఫేస్బుక్ నివేదికలో మొదటిసారిగా స్వయంగా మీకు కూడా హాని కలిగించే కంటెంట్ చుట్టూ తీసుకున్న చర్యలపై డేటాను కూడా ఇందులో జోడించింది. మూడవ త్రైమాసికంలో ఆత్మహత్య లేదా సెల్ఫ్-హిట్టింగ్ ను వర్ణించిన లేదా ప్రోత్సహించిన సుమారు 2.5 మిలియన్ ఫేస్బుక్ పోస్టులను తొలగించినట్లు సంస్థ తెలిపింది.

 

Mi TV: 43-inch స్మార్ట్‌టీవీ ఫ్లాష్ సేల్...తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ లోMi TV: 43-inch స్మార్ట్‌టీవీ ఫ్లాష్ సేల్...తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ లో

వాట్సాప్ గ్రూప్ పర్మినెంట్‌గా బ్యాన్

వాట్సాప్ గ్రూప్ పర్మినెంట్‌గా బ్యాన్

ఫేస్‌బుక్ యాజమాణ్యంలోని వాట్సాప్ యొక్క గ్రూప్ పేరును సరైన రీతిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. అసభ్యకరమైన, హింసను ప్రేరేపించేవిధంగా ఉండే, ఇతర ఆమోద యోగ్యం కాని పదాలను గ్రూప్ పేర్లు, అకౌంట్ పేర్లుగా పెట్టుకుంటే వెంటనే ఆ గ్రూప్‌లు, అకౌంట్లను పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే అలాంటి పేర్లను పెట్టుకున్న ఎంతో మంది గ్రూప్‌లను, అకౌంట్‌లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఈ క్రమంలోనే యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లతోపాటు తాము ఉండే గ్రూప్‌లకు పెట్టుకునే పేర్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఒక్కసారి అకౌంట్ లేదా గ్రూప్ బ్యాన్ అయితే మళ్లీ దాన్ని పొందడం ఇక అసాధ్యం కనుక యూజర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని వాట్సాప్ సూచిస్తున్నది.

 

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook Deletes Unwanted Data Covering 3.2 Billion Fake Acounts And 18.5 Million Child Abuse Posts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X