మార్చి 15 నుండి ఇండియన్ ఫేస్‌బుక్ ఆపరేషన్స్ నిలిపివేత..?

Posted By: Super

మార్చి 15 నుండి ఇండియన్ ఫేస్‌బుక్ ఆపరేషన్స్ నిలిపివేత..?

 

ఈరోజు ఉదయానే ఆఫీసు వచ్చి ఫేస్‌బుక్‌లో  లాగిన్ అవుదామని ప్రయత్నించగా... ఈ క్రింది ప్రాబ్లమ్‌ని దర్శనమిచ్చింది. ఆ ప్రాబ్లమ్ ఏమిటంటే ఫేస్‌బుక్ సర్వర్ మార్చి 13న గుర్తించబడడం లేదు.

మార్చి 15 నుండి ఇండియన్ ఫేస్‌బుక్ ఆపరేషన్స్ నిలిపివేత..?

ఐతే గతంలో ఫిబ్రవరి 25వ తారీఖున సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఒక గంట లేదా అంతకంటే తక్కువ సమయం డౌన్ అయింది. కానీ ఈరోజు ఫేస్‌బుక్‌ని చూసినట్లైతే దాదాపు రెండు గంటలు పాటు డౌన్ అవడమే కాకుండా ఎటువంటి రెస్పాన్స్ లేదు. గతంలో డౌన్ అయినప్పుడు ఫేస్‌బుక్ అప్లికేషన్స్ లైక్ బాక్స్, ఫ్యాన్ పేజి బాక్స్, రికమెండేషన్ బాక్స్‌లు చక్కగా పనిచేశాయి. ఈరోజు మాత్రం ఎటువంటి అప్లికేషన్స్ కూడా పని చేయలేదు అనడానికి ఈ క్రందనున్నా ఇమేజిని చూస్తే మీకు ఇట్టే తెలిసిపోతుంది.

ఐతే ఇండియాలో మాత్రం ఒక రూమర్ ప్రచారంలో ఉంది. ఈ రూమర్ ప్రకారం ఫేస్‌బుక్ ఇండియాలో మార్చి 15వ తారీఖున తనయొక్క ఆపరేషన్స్‌ని పూర్తిగా నిలిపివేయనుందని. కానీ దీనిపై ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఫేస్‌బుక్ యాజమాన్యం ఎటువంటి అధికారక స్టేట్‌మెంట్ ఇవ్వక పోవడంతో దీనిని రూమర్ గానే కొట్టి పారేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యూరప్‌లో ఫేస్‌బుక్ డౌన్ అయినప్పుడు ఫేస్‌బుక్ యాజమాన్యం స్వయంగా కొన్ని సాంకేతిక లోపాల కారణంగా డౌన్ అయిందని తెలిపింది. ఐతే కొన్ని వెబ్ సైట్లు మాత్రం కొందరు హ్యాకర్లు ఎటాక్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందని కథనాలు ప్రచురించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot