సరి కొత్త క‌మ్యూనికేష‌న్ టూల్‌ ను ఆవిష్కరించిన ఫేస్‌బుక్

By Super
|
Mark Zuckerberg
క‌మ్యూనికేష‌న్ల‌రంగంలో ఒక‌ న‌వ‌శకానికి ఫేస్‌బుక్ నాంది ప‌లికింది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. పోస్టుద్వారా ఉత్తరాలు పంపుకోవ‌డాన్ని ఇ మెయిల్ దాదాపు క‌నుమ‌రుగు చేయ‌గా, ఇప్పుడు దానిని త‌ల‌ద‌న్నే కొత్త ఉత్పత్తిని ఫేస్‌బుక్ రూపొందించింది. దాదాపు అర‌ బిలియ‌న్(50కోట్లు)మంది స‌భ్యులుగా ఉన్న సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ - ఫేస్‌బుక్...ఇ-మెయిల్, ఎస్ఎమ్ఎస్‌, చాట్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వంటి వివిధ క‌మ్యూనికేష‌న్‌ల‌ను మేళ‌వించి ఒక కొత్త ఉత్ప‌త్తిని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బెర్గ్, స‌హ వ్యవ‌స్థాప‌కుడు ఆండ్రూ బోస్‌వ‌ర్త్, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో(సిలికాన్‌వ్యాలీ)లో ఈ కొత్త ఉత్పత్తిని గురించి ప్రక‌టించారు.


ఇ-మెయిల్ చేయ‌డం ఒక పెద్ద లాంఛ‌నంగా ఉంద‌ని, స‌బ్జెక్టు రాయ‌డం, సీసీ(CC), బీబీ(BB) వంటి ఖాళీల‌ను నింప‌డం...ఇదంతా ఒక పెద్ద ప్ర‌క్రియ‌గా చేయాల్సివ‌స్తోంద‌ని మార్క్ జుక‌ర్‌బెర్గ్ అన్నారు. చాలా మంద‌కొడిగా, నెమ్మదిగా ఉండే ఈ ఇ-మెయిల్ వ్యవ‌హారం న‌వ‌త‌రానికి ప‌నికిరాద‌ని వ్యాఖ్యానించారు. తాము రూపొందించిన స‌ర్వీస్ చాలా ఇన్‌ఫార్మల్‌గా ఉంటుంద‌ని, దీనితో సుల‌భంగా, సునాయాసంగా సందేశాలు పంపుకోవ‌చ్చని చెప్పారు. అనేక యూజ‌ర్ ఫ్రెండ్‌లీ ఫీచర్స్స్ దీనిలో ఉంటాయ‌ని తెలిపారు. ప్రైవ‌సీ, స్పామ్ వంటి అంశాల విష‌యంలో మిగిలిన సంస్థ‌ల‌కంటే త‌మ‌ది మెరుగ్గా ఉంటుంద‌ని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఉన్న యూజ‌ర్‌నేమ్‌తోనే @ఎఫ్‌బి.కామ్ అనే ఐడీ ఇస్తామ‌ని తెలిపారు. వెంట‌నే ఇది అందుబాటులో ఉండ‌ద‌ని, మెల్లమెల్లగా ప్రవెశపెడతామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఇ-మెయిల్ అంత‌రించిపోతుంద‌ని తాము చేపట్టడంలేదని, భవిష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తిని రూపొందించామ‌ని అన్నారు.


ఫేస్‌బుక్ కొత్త ఉత్పత్తి మొత్తానికి ఇ-మెయిల్ రంగంలో మొద‌టి మూడు స్థానాల‌లో ఉన్న 1.హాట్‌మెయిల్(మైక్రోసాఫ్ట్), 2.యూహూ, 3.గూగుల్ సంస్థలను డిఫెన్స్‌లో ప‌డేసింది. మ‌రి ఈ స‌వాల్‌ను ఎదుర్కోవ‌డానికి వారు ఏమి చేయ‌బోతున్నారో చూడాలి. మొత్తానికి ఒక వినూత్న సంచలన ఉత్పత్తితో ఫేస్‌బుక్ తన స్థాయిని పెంచుకుని మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూల చెంత చేరింది. ప్రపంచమంతా ఉపయోగించే అలాంటి ఒక విస్తృత స్థాయి ఉత్పత్తిని ఇంత అతిపెద్ద మానవవనరులు ఉన్న భారతదేశం ఎందుకు రూపొందించలేకపోతోందో మరి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X