Home
News

5 స్టార్ రేటింగ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన ఫేస్‌బుక్ ఉద్యోగులు!

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సరిగ్గా రెండు నెలల క్రితం పోర్టల్, పోర్టల్+ పేర్లతో రెండు స్మార్ట్ కెమెరా డివైసెస్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సరిగ్గా రెండు నెలల క్రితం పోర్టల్, పోర్టల్+ పేర్లతో రెండు స్మార్ట్ కెమెరా డివైసెస్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ పై రన్ అవుతోన్న ఈ డివైసెస్ మార్కెట్లో మిక్సుడ్ రెస్పాన్స్‌ను సొంతం చేసకున్నాయి.

ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన...

ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన...

ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ యూజర్స్ వీడియో చాటింగ్‌ను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆఫర్ చేస్తుంది. ఈ పోర్టల్ కెమెరాలు ఎటువంటి సబ్జెక్ట్స్‌ను ఐడెంటిఫై చేయవని, వీడియో కాల్స్‌ను కూడా స్టోర్ చేయవని ఫేస్‌బుక్ చెబుతునప్పటికి గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఈ డివైసెస్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకంజ వేస్తున్నారు.

ఫేస్‌బుక్ ఉద్యోగులు...

ఫేస్‌బుక్ ఉద్యోగులు...

ఈ నేపథ్యంలో కస్టమర్స్‌ను కన్విన్స్ చేసి వారితో ఈ డివైస్‌లను కొనిపించే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ ఉద్యోగులు 5-స్టార్ రేటింగ్స్‌ను ప్రొడక్ట్ రివ్యూస్‌లో ఇస్తున్నారట. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ కెవిన్ రూస్ తన పరిశోధనలో తేల్చారు. ప్రొడక్ట్ రివ్యూస్‌లో ఉన్న పేర్లతో ఫేస్‌బుక్ ఉద్యోగుల పేర్లు మ్యాచ్ అయ్యాయిని ఆయన అన్నారు. ఈ రివ్యూస్ అన్నింటిని అమెజాన్ వెరిఫై చేసందని, కాబట్టి వీళ్లంతా పోర్టల్ డివైస్‌ను ఒకసారైనా కొనుగోలు చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెజాన్ నిబంధనలకు వ్యతిరేకం...

అమెజాన్ నిబంధనలకు వ్యతిరేకం...

మీ యజమాని ఉత్పత్తులను మీరే రివ్యూ చేయటం అమెజాన్ నిబంధనలకు వ్యతిరేకం అంటూ సదరు రిపోర్టర్ కామెంట్ చేసారు. అమెజాన్ రూల్స్ ప్రకారం పోర్టల్‌లో విక్రయించే ప్రొడక్ట్స్ పై సంబంధిత యజమాని లేదా అతని అసోసియేట్స్ కామెంట్స్ చేయటమనేది పూర్తిగా విరుద్థమైన చర్య.

రిఫర్ చేసిన ఫేస్‌బుక్ ఉద్యోగులు...

రిఫర్ చేసిన ఫేస్‌బుక్ ఉద్యోగులు...

ఈ డివైస్‌ను రిఫర్ చేసిన ఫేస్‌బుక్ ఉద్యోగులు "really cool", "AMAZING", "great", "impressive" వంటి పదాలను ప్రొడక్ట్ రివ్యూస్‌లో ఉపయోగించినట్లు కెవిన్ రూస్ తెలిపారు. ఈ కథనం పై స్పందించిన ఫేస్‌బుక్ ఉద్యోగి టిమ్ ఛాపెల్ స్పందిస్తూ తాను పెద్దగా ఫేస్‌బుక్ యూజర్ కానప్పటికి 4 పోర్టల్ డివైసెస్‌తో పాటు ఒక పోర్టల్ ప్లస్ డివైస్‌ను తన కుటంబం కోసం కొనుగులు చేసినట్లు తెలిపారు.

ఫేస్‌బుక్ ఏఆర్, వీఆర్ విభాగాల వైస్ ప్రెసిడెంట్...

ఫేస్‌బుక్ ఏఆర్, వీఆర్ విభాగాల వైస్ ప్రెసిడెంట్...

ఈ మొత్తం తతంగం పై ఫేస్‌బుక్ ఏఆర్, వీఆర్ విభాగాల వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బోస్వర్త్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ తాము ఆ విధంగా రాయమని వారికి చెప్పలేదని వెంటనే అటువంటి రివ్యూలను తొలగించాలని వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook employees have been caught leaving five-star reviews for Portal on Amazon.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X