ఇక నుండి ఫేస్‌బుక్ రాజకీయాలు కూడా చేస్తుంది...

Posted By: Staff

ఇక నుండి ఫేస్‌బుక్ రాజకీయాలు కూడా చేస్తుంది...

ప్రపంచపు పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగుని పులుముకుంటుంది. ఇదేంటి కొత్తగా అని అనుకుంటున్నారా.. రాజకీయ పార్టీల క్యాండిడేట్స్ కోసం ఉద్యోగస్తుల సోషల్ నెట్ వర్కింగ్‌లో ఉన్న సభ్యులు అందరూ కలసి ఫైనాన్సియల్‌గా సపోర్ట్ అందించే భాగంలో దీనిని రూపొందించడం జరిగింది. దీని కొసం ఫేస్‌బుక్ ప్రత్యేకంగా ఫెడరల్ ఎకక్షన్ కమిటీకి పేపర్ వర్క్ అంతా పంపించడం జరిగింది.

ఫేస్‌బుక్ ఈ పోలిటికల్ యాక్షన్ కమిటీ(PAC)లను అమెరికాని దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. సాధారణంగా అమెరికాలో కార్పోరేట్స్ ఈ పోలిటికల్ యాక్షన్ కమిటీల ద్వారా తమవంతు సాయంగా ఎలక్షన్‌లో నుంచున్న అభ్యర్దులకు సుమారు USD 5,000గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేస్‌బుక్ పోలిటికల్ యాక్షన్ కమిటీల ద్వారా కార్పోరేట్ సెక్టార్స్‌ లలో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారియొక్క ఆలోచనలు, గోల్స్‌ను దేశానికి ఎలా ఉపయోగించాలో ఎలక్షన్‌లో నుంచున్న అభ్యర్దులతో పంచుకోవడం జరుగుతుంది.

ప్రపంచం మొత్తం మీద ఫేస్‌బుక్లో సుమారు 800మిలియన్ యూజర్స్ ఉన్నారు. రాబోయే కాలంలో ఫేస్‌బుక్ నెట్ వర్క్‌ని మరింతగా అభివృద్ది చేసేందుకు గాను వాషింగ్టన్‌లో హై ప్రోఫైల్ జనాభాని నియమించడం జరుగుతుంది. ఇటీవలే మాజీ అమెరికా అద్యక్షుడు బిల్ క్లింటన్ ప్రతినిధి జోయి లాక్ హార్ట్‌ని సోషల్ నెట్ వర్కింగ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా నియమించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot