పెళ్లి చేసుకున్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు!

Posted By: Prashanth

పెళ్లి చేసుకున్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు!

 

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ (28) తన చిరకాల స్నేహితురాలైన ప్రిస్ సిల్లా చాన్(27)ను శనివారం ఘనంగా వివాహమాడారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఈ వేడక ఘనంగా జరిగినట్లు బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. ఈ పెళ్లికి సంబంధించి అపడేట్ చేసిన ఫోటోను అరగంటలోనే ఒక లక్షా ముప్పైవేల మంది వీక్షించటం విశేషం.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్’ శుక్రవారం అతిభారీ ఐపివోని జారీ చేసింది. ఒక్కక్క షేరు ధర 38 డాలర్లు. మొత్తం 10,400 కోట్ల డాలర్లు (104 బిలియన్ డాలర్ల) విలువైన షేర్లను కంపెనీ విక్రయిస్తుంది. శుక్రవారం నుంచి నాస్‌డాక్‌లో ‘ఎఫ్‌బి’ గుర్తుతో షేర్ల విక్రయం ప్రారంభమైంది. ఒక టెక్నాలజీ కంపెనీ ఇంత భారీ స్థాయిలో ఐపివోను జారీ చేయడం ఇది తొలిసారి. 2004లో ప్రారంభమై 900 మిలియన్ల మంది సభ్యులు గల ఈ సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ఐపివో కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 421 మిలియన్ల షేర్లను ఈ కంపెనీ విక్రయిస్తున్నట్లు ఆ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot