ఫేస్‌బుక్ లో ప్రేమ పేరుతో నమ్మించి 90 లక్షలు మోసం
ఫేస్‌బుక్ ప్రేమతో ఓ అమ్మాయి మోసపోయింది.పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఏకంగా ఆమె వద్ద 90లక్షలు దోచుకుని పరారయ్యాడు.
ఫేస్‌బుక్ ప్రేమతో ఓ అమ్మాయి మోసపోయింది.పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఏకంగా ఆమె వద్ద 90లక్షలు దోచుకుని పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలిచ్చిన ఫిర్యాదులోని వివరాలు.. బెంగుళూరు కి చెందిన సారిక కు (పేరు మార్చబడింది) యశ్వంతపూర్ లో నివసించే వాదిరాజ్ గౌడా (40)తో ఏడాది కిందట ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పరచుకొని....
మొదట తను కొరియోగ్రాఫర్ అంటూ బాధితురాలితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పరచుకొని ప్రతో రోజు చాటింగ్ చేసేవాడు. తన కళ్ళబొల్లి మాటలతో నమ్మించి ప్రేమలోకి దించాడు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్...
ప్రేమలో నిండా మునిగిపోయిన బాధితురాలికి తాను కొరియోగ్రఫీ తో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నాడని చెప్పాడు.పెళ్లి చేసుకుంటా అని నమ్మించి బాధితురాలి ఇంట్లోవాళ్లతో ,బంధువులతో స్నేహితులతో పరిచయం ఏర్పరచుకున్నాడు.

BDA సైట్లు కొనుగోలు చేయడానికి....
వాదిరాజ్ గౌడా తన స్నేహితులను మరియు బంధువులను BDA సైట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించమని ఆమెను కోరాడు.పిచ్చిగా నమ్మేసిన బాధితురాలి తమ ఇంట్లో వాళ్ళతో బంధువులతో మొత్తంగా 45 మంది తో 90 లక్షలు కలెక్ట్ చేసి వాదిరాజ్ కి ఇచ్చింది.

మొబైల్ ను స్విచ్ ఆఫ్....
డబ్బులు చేతికి అందగానే బాధితురాలిని దూరంగా పెట్టడం ప్రారంభించాడు .తన నుంచి తప్పించుకోవాలిని మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసేవాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలో దిగిన పోలీసులు....
రంగంలో దిగిన యశ్వంతపూర్ పోలీసులు చివరికి తమిళనాడులోని సేలం జిల్లాలో వాదిరాజ్ ను అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications








