ఈ విషయంలో ఫేస్‌బుక్ కంటే గూగుల్ ప్లస్ గ్రేట్

Posted By: Super

Google+-Facebook

న్యూయార్క్: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో గూగుల్ ప్లస్ వచ్చిన తర్వాత గట్టి పోటీ ఎదుర్కుంటున్నాయి. అంతేకాదండోయ్ గూగుల్ ప్లస్ ఓ రికార్డుని కూడా నమోదు చేసింది. ఆ రికార్డు ఏమిటంటే ఆన్ లైన్ రీసెర్ట్ సంస్దలు కామ్ స్కోర్, గూగుల్ రెండు తెలిపిన దాని సమాచారం ప్రకారం గూగుల్ ప్లస్‌ ఒకే ఒక్క నెలలో 25మిలియన్ యూజర్లు జాయిన్ అవ్వడంతో ప్రపంచంలో అతి తక్కువ కాలంలో బాగా అభివృద్ది చెందిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా రికార్డు సాధించింది. ఇది ఇలా ఉంటే ఇదే 25మిలియన్ యాజర్లు ప్రస్తుతం 700మిలియన్ యూజర్లు ఉన్నటువంటి ఫేస్‌బుక్‌కి మూడు సంవత్సరాలు పట్టిందని సమాచారం.

ఇక మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయినటువంటి ట్విట్టర్‌లో అదే 25మిలియన్ యూజర్లు చేరడానికి గాను 30 నెలలు పట్టిందని రీసెర్ట్ సంస్ద కామ్ స్కోర్ వెల్లిడించింది. వీటితోపాటు గూగుల్ ప్లస్‌లో ఎక్కువ యూజర్స్ ఉన్నదేశంగా మొదటి స్దానంలో అమెరికా ఉండగా, రెండవ స్దానంలో ఇండియా, ఆ తర్వాత కెనడా, లండన్‌లు ఉన్నాయి. పోయిన నెలలో గూగుల్ ప్లస్‌ని విశిష్ట యూజర్స్‌గా 6 మిలయన్ల మంది చూడగా, అదే ఇండియాలో 3.6 మిలియన్ యూజర్స్ చూడడం జరిగింది.

ఇక కెనడా, బ్రిటన్ రెండూ కూడా కేవలం 1మిలియన్ విశిష్ట యూజర్స్‌ని అందించగా, జర్మనీ, బ్రెజిల్ 920000, 780, 000గా ఉన్నాయి. ఈ సందర్బంలో కామ్ స్కోర్ వైస్ ప్రెసిడెంట్(ఇండస్ట్రీ ఎనాలసిస్) ఆండ్రూ లిప్స్ మ్యాన్ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఇంత అభివృద్ది సాధించడం అనేది చాలా అరుదైన విషయంగా అభివర్ణించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot