గూగుల్ ప్లస్ డిజైన్స్‌ని ఫేస్‌బుక్ కాపీ కొడుతుందా....?

Posted By: Staff

గూగుల్ ప్లస్ డిజైన్స్‌ని ఫేస్‌బుక్ కాపీ కొడుతుందా....?

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ గూగుల్ ప్లస్ నుండి పోటీని తట్టుకొని యూజర్స్‌ని ఆకర్షించేందుకు గాను నిదానంగా గూగుల్ ప్లస్‌లో ఉన్ని కొన్ని ఫీచర్స్‌ మాదిరే ఫేస్‌బుక్‌లో కూడా అభివృద్ది చేయడం జరిగింది. సాధారణంగా మనం మొదట్లో చూసిన ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్, పోటోలు, కంటెంట్ అప్ డేట్ అయ్యే విధానం అంతా గుర్తు ఉండే ఉంటుంది. ఎప్పుడైతే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్‌ని విడుదల చేసిందో ఆ తర్వాత ఉన్న ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్, ఫోటోలు ప్యాట్రన్ అంతా చూసే ఉంటారు.

ముఖ్యంగా మనం చూసినట్లేతే గతంలో ఫేస్‌బుక్ నావిగేషన్ ప్యానల్ పైభాగంలో ఉండగా ఇటీవల విడుదలైన గూగుల్ ప్లస్‌లో మాత్రం నావిగేషన్ బార్ కుడివైపున ఉంచడం జరిగింది. సరిగ్గా ఫేస్‌బుక్లో కూడా నావిగేషన్ బార్‌ని కుడివైపున చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. దీనిని చూసిన నేను అచ్చం గూగుల్ ప్లస్‌లో నావిగేషన్ బార్ కుడి వైపున ఉండడాన్ని గమనించిన ఫేస్‌బుక్ కూడా తనయొక్క నావిగేషన్ బార్‌ని కుడివైపుకి తీసుకొని రావడం జరిగిందని అనుకుంటున్నాను.

ఇక గూగుల్ ప్లస్‌ బీటా వర్సన్‌ని విడుదల చేసిన అనతికాలంలోనే యూజర్స్ యొక్క మన్ననలు అందుకొవడానికి కారణం దానియొక్క డిజైన్ ప్యాట్రనే అని అంటున్నారు చాలా మంది యూజర్స్. అందుకే కాబోలు ఫేస్‌బుక్ కూడా కొన్ని కొన్ని ప్యాట్రన్స్‌ని గూగుల్ ప్లస్ మాదిరే రూపోందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఫేస్‌బుక్ కొత్త ఫోటో డిజైన్ గనుక చూసినట్లేతే అచ్చం గూగుల్ ప్లస్‌ని కాపీ కొట్టనట్లుగా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా న్యూస్ ఫీడ్ బై టైమ్ విండోని కూడా గమనించినట్లైతే ఫేస్‌బుక్ కొత్తగా రూపోందించిన అన్ని డిజైన్స్ కూడా అచ్చం గూగుల్ ప్లస్ డిజైన్స్ మాదిరే ఉన్నాయనడంలో ఎటువంటి సందేహాం లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot