ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ‘గ్రాఫ్ సెర్చ్’

Posted By: Super

 ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ‘గ్రాఫ్ సెర్చ్’

 

ఫేస్‌బుక్ కొత్త ఆవిష్కరణకు సంబంధించి గత కొంత కాలంగా నెలకున్న సందిగ్థతకు తెరపడింది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రం మెన్లో పార్క్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ తమ సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించారు. పేరు ‘గ్రాఫిక్ సెర్చ్’.ఈ సరికొత్త సర్వీస్ ద్వారా యూజర్ ఫోటోలు, ఇష్టమైన ప్రదేశాలు, మిత్రులకు సంబంధించిన సమాచారాన్ని శోధించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సర్వీస్ వెబ్‌సైట్‌కు మాత్రమే అందుబాటులో ఉందని మొబైల్ ప్రొడక్ట్‌గా త్వరలో మారనుందని ఈ సందర్భంగా జూకర్ బర్గ్ తెలిపారు.

రోబో రెస్టారెంట్‌కు స్వాగతం (ఫోటో గ్యాలరీ)

ట్విట్టర్ నుంచే ఫేస్‌బుక్‌‌లోకి కనెక్ట్ అవ్వాలంటే…?

ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు మీరు వీరాభిమానా..?, రెగ్యులర్‌గా వీటితో టచ్‌లో ఉంటున్నారా..?, ఒకే కంటెంట్‌ను ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారా..?, అయితే, ఇప్పటి వరకు మీరు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను వేరువేరుగా ఓపెన్ చేసి కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. అలాకాకుండా, ట్విట్టర్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వెబ్ బ్రౌజర్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్విట్టర్.కామ్‌లోకి వెళ్లండి. మీ ఆకౌంట్‌లోకి లాగినై కుడివైపు కార్నర్‌లో ఉన్న ‘యూజర్ సింబల్’అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం ప్రొఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసిన ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ‘పోస్ట్ యువర్ ట్వీట్స్ టూ ఫేస్‌బుక్’అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం సైన్ ఇన్ టూ ఫేస్‌బుక్ బటన్ పై క్లిక్ చేసి లాగిన్ కండి. మీ సెక్యూరిటీ వివరాలను ట్విట్టర్ స్టోర్ చేసుకోదు కాబట్టి, భద్రంగా ఉంటాయి. లాగిన్ అయిన అనంతరం ‘కనెక్ట్ టూ ఫేస్‌బుక్’అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ అప్లికేషన్‌కు కనెక్ట్ కండి. మీ అప్‌డేట్‌లను పోస్ట్‌చేసే విధంగా అప్లికేషన్‌కు అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. పేజీ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన డ్రాప్ డౌన్ మెనూలో అప్‌డేట్‌లు పొందాల్సిన స్నేహితులను ఎంచుకోవచ్చు, ఇప్పుడు లాగిన్ విత్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే విండోలో‘Allow’ ‘Skip’ అనే రెండు ఆప్షన్‌లు ప్రత్యక్షమవుతాయి. Allow బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫేస్‌బుక్‌లో మీ ట్విట్టర్ ఆకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ లభిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot