ఫేస్‌బుక్‌లో 8కోట్ల బోగస్ ఆకౌంట్లు!

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో 8కోట్ల బోగస్ ఆకౌంట్లు!

న్యూయార్క్: అవును మీరు వింటున్నది నిజమే..ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో నకిలీ ఆకౌంట్లు కూడా ఉన్నాయట!. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్కే వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 95.5 కోట్ల మంది యూజర్లు ఉంటే అందులో దాదాపు 8.7 శాతం (ఇంచు మించు 8.3 కోట్లు ఆకౌంట్లు) నకిలీవని అమెరికన్ స్టాక్ మార్కెట్ల రగ్యుటేలర్ సెక్యూరిటీస్ ఎక్స్సేంజ్ కమిషన్ ప్రకటించింది. మొత్తం అకౌంట్లలో 4.8 శాతం డూప్లికేట్ అకౌంట్లని, అదనపు అకౌంట్ కింద యూజర్లు వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపింది. వీటితో పాటు నకిలీ అకౌంట్లు కూడా ఉన్నాయని, ప్రత్యేక వ్యాపకం లేదా వ్యాపారం కోసం నకిలీ అకౌంట్లను కొంతమంది సృష్టిస్తుంటారని ఫేస్‌బుక్ సదరు ప్రకటనలో తెలిపింది. వీటిని స్పామ్ అకౌంట్లుగా భావిస్తామని ఈ సంస్థ స్పష్టం చేసింది. జూన్ 30 నాటికి మొత్తం యూజర్లలో నకిలీ అకౌంట్లు 2.4 శాతం ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో నకిలీ అకౌంట్ల సంఖ్య తక్కువ కాగా ఇండోనేషియా, టర్కీ వంటి దేశాల్లో ఈ తరహా అకౌంట్లు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియాలలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పెరిగిపోయిందని, మెరుగైన వృద్ధిరేటుకు ఈ మార్కెట్లే కారణమని వివరించింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting