యూజర్ల డేటా సేకరణకు ఫేస్‌బుక్ స్టడీ యాప్, ఎందుకంటే ?

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ డేటా ప్రకంపనలు ఈ మధ్య సంచలనంగా మారి దాని పీకల మీదకు తెచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మచ్చ మాసిపోవడానికి చాలా కాలమే పట్టింది .ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలను ఫేస్‌బుక్ చవిచూసింది. డేటా స్కాం నీలినీడలె ఇప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఫేస్‌బుక్ అవేమి పట్టించుకున్నట్లు కనపడటం లేదు. మళ్లీ డేటా చోరి పని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

యూజర్ల డేటా సేకరణకు ఫేస్‌బుక్ స్టడీ యాప్, ఎందుకంటే ?

ఫేస్‌బుక్ ఈ మధ్య కొత్తగా యూజర్ల డేటాను ఫోన్ ద్వారా సేకరించేందుకు గానూ సరికొత్త యాప్ తయారుచేస్తుందని దాని ద్వారా యూజర్ల డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి.

 ఫోన్ లోని డేటా మొత్తం ట్రాక్

ఫోన్ లోని డేటా మొత్తం ట్రాక్

ఫేస్‌బుక్ యాప్ ని యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయగానే ఈ యాప్ ఫోన్ లోని డేటా మొత్తం ట్రాక్ చేస్తుందని రిపోర్ట్ తెలిపింది. దీంతో పాటు వారు యూజ్ చేస్తున్న మొత్తం యాప్ ల వివరాలు దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని సేకరిస్తుందని ఇది చాలా ప్రమాదకర సంకేతాలను తీసుకెళ్లే అవకాశం ఉందని రిపోర్ట్ తెలియజేసింది.

 ఫేస్ బుక్ స్పందన

ఫేస్ బుక్ స్పందన

అయితే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దీనిపై స్పందించింది. యాప్ వాస్తవమేనని అయితే ఈ యాప్ మీ ఫోన్లలోని స్పెసిఫిక్ కంటెంట్ అయిన passwords, messages or the websites the user visits లాంటి వాటిని ట్రాక్ చేయదని తెలిపింది. దీంతో పాటు మేమ సేకరించే డేటా ఎట్టి పరిస్థితుల్లోనే థర్డ్ పార్టీ యాప్ లకు అమ్మడం కాని అలాగే ఆ కంటెంట్ మీద టార్గెట్ యాడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్లే చేయమని తెలిపింది.

ఆహ్వానం

ఆహ్వానం

ఇదిలా ఉంటే ఈ Facebook Study program మీద స్టడీ యాప్ ద్వారా పార్టిస్ పెంట్స్ కి ఆహ్వానాలు పంపింది. ఆసక్తి ఉన్నవారు దీని మీద ఆసక్తి ఉన్న వారు ఈ యాప్ వాడుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ పోగ్రాంలో పార్టిస్ పేట్ చేయాలనుకున్న వారు ఈ పోగ్రాం ద్వారా రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. అలాగే ఈ పోగ్రాం నుంచి ఎప్పుడైనా నచ్చకుంటే బయటకు వెళ్లవచ్చని మీరు దాన్ని uninstalling చేయడం ద్వారా మీ స్టడీ పోగ్రాం ఎండ్ అవతుందని తెలిపింది.

అసలెందుకు ?

అసలెందుకు ?

ఈ Study app గురించి ఫేస్‌బుక్ తన అఫిషఇయల్ పేజీలో పోస్ట్ చేసింది. ఇది కేవలం కొంత సమాచారం సేకరించడానికి మాత్రమేనని దీని ద్వారా ఫేస్‌బుక్ భద్రతను మరింతగా కాపాడుకునేందుకేనని తెలిపింది. age, genderతో పాటు యూజర్లు Facebook Company Products ఎలా వాడుతున్నారో తెలుసుకోవడానికేనని తెలిపింది. Study app ద్వారా యూజర్లకు ఢిపరెంట్ సర్వీసులను ఎలా వాడుతున్నారో తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశమని కంపెనీ చెబుతోంది.

దీన్ని మేము ఎక్కడా యాడ్ చేయం : ఫేస్‌బుక్

దీన్ని మేము ఎక్కడా యాడ్ చేయం : ఫేస్‌బుక్

ఈ సందర్భంగా మేమే ఎక్కడా దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ ఉత్పత్తుల్లో అందివ్వమని కేవలం Study app ద్వారానే మీరు మా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని తెలిపింది. ఈ స్టడీ యాప్ 18 సంవత్సరాలు నిండినవారు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇండియా , యుఎస్ వంటి దేశాల్లో ఫేస్‌బుక్ యాడ్స్ క్యాంపెయిన్ ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
Facebook has a new app that will collect your data and pay you for it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X