ఫేస్‌బుక్ సంస్థకు జర్నలిస్టులు కావలెను

By Gizbot Bureau
|

ఫేస్‌బుక్‌లో న్యూస్ ఈ అంశంపై కొద్ది రోజుల ముందే సీఈవో మార్క్ జూకర్ బర్గ్ బయటపెట్టగా ఇప్పుడు మరో కొత్తరూపం దాల్చింది. ఫేస్‌బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే అందించేందుకు ప్రయత్నిస్తోంది..

Facebook Hiring Journalists To Curate Its New News Tab

సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ‍్యంలో తన న్యూస్‌ ట్యాబ్‌కోసం సీనియర్‌ జర్నలిస్టుల బృందాన్ని నియమించుకోనుంది.

 న్యూస్ టాబ్ ఫీచర్‌

న్యూస్ టాబ్ ఫీచర్‌

న్యూస్ టాబ్ ఫీచర్‌ ఆవిష్కరణను ధృవీకరించిన సంస్థ అనుభవజ్ఞులైన జర్నలిస్టుల పర్యవేక్షణలో తమ న్యూస్‌ఫీడ్‌ ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. ఒక​ బృందం ఆధ్వర్యంలో విశ్వసనీయయైన, బ్రేకింగ్‌, టాప్‌​ వార్తా కథనాలను ఎన్నుకుంటామని తెలిపింది. వినియోగదారు అభిరుచులను గుర్తించడానికి అల్గారిథమ్‌లపై ఆధారపడతామని పేర్కొంది.

స్వంతంగా తామే జర్నలిస్టులను

స్వంతంగా తామే జర్నలిస్టులను

న్యూస్ టాబ్‌ను పర్సనలైజ్ చేయాలనుకుంటున్నాం. కేటగిరీ ప్రకారం న్యూస్‌ను డివైడ్ చేసి వినియోగదారులకు మంచి సేవను అందించాలనుకుంటున్నామని ఫేస్‌బుక్ మేనేజ్మెంట్ తెలిపింది. స్వంతగా తామే జర్నలిస్టులను రిక్రూట్ చేసుకుని జాబ్ ఇస్తామని కంపెనీ ముందుకొచ్చింది.

డిమాండబుల్ న్యూస్ పబ్లిష్

డిమాండబుల్ న్యూస్ పబ్లిష్

ప్రజలకు వ్యక్తిగతీకరించిన, అత్యంత సందర్భోచితమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్ న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ క్యాంప్‌బెల్ బ్రౌన్మీడియాకు వెల్లడించారు. సరైన కథనాలనే హైలైట్ చేస్తున్నామని నిర్ధారించుకునేందుకు పాత్రికేయుల బృందాన్ని తీసుకుంటు న్నప్పటికీ , ప్రజల ఆసక్తిని ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ ద్వారానే గుర్తిస్తామని తెలిపింది. ప్రస్తుతం న్యూస్ ఫీడ్ అని ప్రత్యేక విభాగంలో స్నేహితుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇదే తరహాలో ఫేస్‌బుక్ డిమాండబుల్ న్యూస్ పబ్లిష్ చేసేందుకు సిద్ధమైంది.

 న్యూస్ ఇవ్వడానికి మంచి టీం

న్యూస్ ఇవ్వడానికి మంచి టీం

కాగా మెరుగైన, విశ్వసనీయ సమాచారాన్ని యూజర్లకు అందించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త న్యూస్‌ ఫీచర్‌ని తీసుకొస్తున్నామని ఈ ఏడాది ఆరంభంలో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఫేక్‌ న్యూస్‌ పై ప్రపంచవ్యాప్తంగా భారీగా ఒత్తిడి వస్తున్న క్రమంలో వీటి నిరోధంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తొలి రోజుల్లోలా కాకుండా న్యూస్ ఇవ్వడానికి మంచి టీం రెడీగా ఉంది. ఈ సర్వీస్‌తో మరిన్ని సేవలు అందించనున్నామని ఓ పత్రికలో ఫేస్‌బుక్ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Facebook Hiring Journalists To Curate Its New News Tab

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X