ఫేస్‌బుక్‌కి ఇండియా అతి పెద్ద యూజర్ డేటాబేస్ కాబొతుందా..

Posted By: Staff

ఫేస్‌బుక్‌కి ఇండియా అతి పెద్ద యూజర్ డేటాబేస్ కాబొతుందా..

ఫేస్‌బుక్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లైతే ఫేస్‌బుక్ యూజర్ డేటాబేస్ ఇండియా నుండి చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఫేస్‌బుక్‌ని వాడేటటువంటి ఇండియన్ యూజర్స్ నెట్ కంటే కూడా మొబైల్ పోన్స్‌ని ఎక్కవగా వాడుతున్నట్లు తెలిపింది. ఇటీవల జులైలో ఫేస్‌బుక్ నిర్వహించిన ఈవెంట్‌లో జులై నాటికి ఫేస్‌బుక్ 750 మిలియన్ యూజర్స్ ఉండగా, కేవలం తొమ్మిది నెలలో 50 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్స్‌ని సంపాదించడమే కాకుండా, ఎక్కువ మంది యూజర్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు నుండి కాక వేరే దేశాల నుండి రావడం ఇక్కడ గర్వించతగ్గ విషయమని కొనియాడారు. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఫేస్‌బుక్ పొటీగా గూగుల్ ప్లస్‌ని విడుదల చేసినప్పటికీ, సోషల్ మీడియా రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ వాడేటటువంటి యూజర్స్ స్దానంలో ఇండియా మూడవ స్దానంలో ఉంది. ఇండియాలో ఫేస్‌బుక్ యూజర్స్ ప్రతి సంవత్సరానికి గాను 84శాతం అభివృద్ది చెందుతుండగా, ఇప్పటికి ఇండియాలో ఫేస్‌బుక్ ఎకౌంట్లు కలిగిన వారి సంఖ్య 34మిలియన్లు. అదే ఇండోనేషియాలో 45మిలియన్లు. జనాభాని బట్టి చూస్తే ఫేస్‌బుక్ త్వరలో అమెరికాని, ఆ తర్వాత ఇండోనేషియాని అధిగమిస్తుందని ఫేస్‌బుక్ నిపుణులు అభిప్రాయపడుతున్నా రు.

ఫేస్‌బుక్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమయొక్క డెస్కటాప్‌ల కంటే కూడా మొబైల్స్‌లలోనే ఎక్కవ సార్లు లాగిన్ అవుతున్నట్లు తెలిపింది. దీనిని బట్టి పేస్‌బుక్ రాబోయే కాలంలో బేసిక్ మోడల్స్‌లలో కూడా ఫేస్‌బుక్ బటన్‌ని నిక్షిప్తం చేసేందుకు గాను తైవాన్ ఛిప్ మేకర్ మీడియా టెక్‌తో చేతులు కలిపింది. మీడియా టెక్ సహాయంతో ఫేస్‌బుక్ ఇండియాలో మైక్రోమ్యాక్స్, స్పెస్ మొబైల్స్‌లలో ఫేస్‌బుక్‌ని తప్పని సరిగా ఇమిడికృతం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

అంతేకాకుండా ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కొసం కూడా మొబైల్ ఫోన్స్‌ని తయారు చేస్తున్నారు. హెచ్‌టిసి ఛాచా, మైక్రోమ్యాక్స్ త్వరలో ఫేస్‌బుక్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టనున్నాయి. వీటి ధర సుమారుగా రూ 5,000ల కంటే తక్కవగా ఉండేటట్లు నిర్ణయం తీసుకొనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot