‘ఫేస్‌బుక్ ఇండియా ’ దూకుడు!

Posted By: Prashanth

‘ఫేస్‌బుక్ ఇండియా ’ దూకుడు!

 

భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం అనూహ్య రీతిలో పెరుగుతోందని ఫేస్‌బుక్ ఇండియా సంచాలకులు(ఆన్‌లైన్ ఆపరేషన్స్) కీర్తిగా రెడ్డి తెలిపారు. ‘రీ-థింకింగ్ ఉమెన్ ఇన్ లీడర్ షిప్: యాన్ ఇండో యూఎస్ పర్‌స్పెక్టివ్’ అనే అంశం పై ఇండోఅమెరికన్ చాంబర్స్ (ఐఎసీసీ) మంగళవారం ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫేస్‌బుక్‌ను అనుసరిస్తున్నవారు అత్యధికంగా డెస్క్‌టాప్ కంటే మొబైల్ ఫోన్‌ల ద్వారానే అప్‌డేట్‌లను సాగిస్తున్నారని చెప్పారు. 2010లో భారత్‌లో 80 లక్షలుగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం 5 కోట్లకు పెరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశీయ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని కీర్తిగా రెడ్డి వెల్లడించారు. 13 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్‌బుక్ చూడకూడదని, అలా చూస్తున్నట్లు తేలితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot