ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ లను దాచే కొత్త ఫీచర్!! దీన్ని ఉపయోగించే విధానం...

|

ప్రపంచం మొత్తం మీద గల ప్రముఖ సోషల్ మీడియా యాప్ లలో ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటాయి. వినియోగదారులు తమ యొక్క జ్ఞాపకాలను మరియు బిజినెస్ విస్తరణ కోసం అధికంగా ఈ యాప్ లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు యాప్ లు వినియోగదారులకు వారి పోస్టులను ప్రజల నుండి దాచుకునే అవకాశాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా నెట్‌వర్క్ లో ఈ సోషల్ మీడియా యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు ఇది వారి అనుభవంపై నియంత్రణను ఇస్తుందని సంస్థ పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్

ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల అనుభవాన్ని 'నిరుత్సాహపరిచే' మార్గంగా ఫేస్‌బుక్ 2019 నుండి వినియోగదారుల పోస్టులను బహిరంగ పోస్ట్ చేసిన పోస్ట్ యొక్క లైక్ నెంబర్లను దాచే ఎంపికను పరీక్షిస్తోంది. కొంతమంది వినియోగదారులకు ప్లాట్‌ఫామ్‌ను తక్కువ ఒత్తిడిని కలిగించే ప్రయత్నంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఇటీవలి సంవత్సరాలలో పోస్టులను దాచడానికి అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తోంది. మే 26 నాటికి వినియోగదారులు ఫీడ్‌లో వారు పంచుకునే పోస్ట్‌లపై లైక్‌ల సంఖ్యను ప్రజలు చూడగలరా అని ఎంచుకోగలుగుతారు.

ట్రెండింగ్

"ప్రజలు మరియు నిపుణుల నుండి మేము విన్నది ఏమిటంటే ఏదైనా పోస్ట్ యొక్క లైక్ గణనలను చూడటం కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ చాలా మందికి బాధించేదిగా ఉంటుంది. ప్రత్యేకించి ప్రజలు ట్రెండింగ్ లేదా జనాదరణ పొందిన వాటికి అర్ధవంతం కావడానికి ఈ లైక్ నంబర్లు వంటివి ఉపయోగిస్తున్నారు కాబట్టి మేము మీకు దాచే ఎంపిక ఇస్తున్నాము" సంస్థ ఒక బ్లాగ్ పోస్ట్‌లో గుర్తించింది. ఈ ఫీచర్ అమలుతో వినియోగదారులు తమ యొక్క పోస్టులు ఎన్ని లైక్స్ పొందిందో బదులుగా మరొకరికి భాగస్వామ్యం చేయబడిన ఫోటోలు మరియు వీడియోలపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ లను హైడ్ చేయడం ఎలా?
 

ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ లను హైడ్ చేయడం ఎలా?

** ఇన్‌స్టాగ్రామ్‌లోని వినియోగదారులు పోస్ట్‌ను షేర్ చేయడానికి ముందు లేదా తర్వాత వారి లైక్స్ గణనలను దాచవచ్చు. అలా చేయడానికి పోస్ట్ పైభాగంలో కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలను ఎంచుకుని ఆపై 'హిట్ లైక్ కౌంట్' ఎంపికపై నొక్కండి. సెట్టింగులలో ఈ ఎంపికను ఆపివేసే అవకాశాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూడా అందించింది.

** అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇతర వ్యక్తుల పోస్ట్‌లపై గల లైక్స్ నెంబర్లను దాచడానికి సెట్టింగ్‌లకు వెళ్లి ఆపై పోస్ట్‌ల కోసం చూడండి. ఆ తర్వాత "లైక్ అండ్ వ్యూ కౌంట్స్" పక్కన ఉన్న టోగుల్‌ను నొక్కండి మరియు ఇది ఫీడ్‌లోని అన్ని పోస్ట్‌లకు వర్తిస్తుంది.

 

ఫేస్‌బుక్‌లో లైక్ కౌంట్ లను హైడ్ చేయడం ఎలా?

ఫేస్‌బుక్‌లో లైక్ కౌంట్ లను హైడ్ చేయడం ఎలా?

ఫేస్‌బుక్‌లో కూడా ఈ కార్యాచరణ ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగానే ఉంటుంది. మీ కంటెంట్ లేదా ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర వినియోగదారుల పోస్ట్ లను దాచడం వంటి రెండు ఎంపికలు రాబోయే వారాల్లో ఫేస్‌బుక్‌లోకి రానున్నాయి. ఈ ఎంపికను తీసుకురావడానికి కారణం విమర్శలకు గురైనప్పుడు కొంతమంది వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం. ఈ సర్వీస్ "యువకుల మానసిక ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు అత్యంత హానికరం" అని అధ్యయనాలు కనుగొన్నాయి.

Best Mobiles in India

English summary
Facebook, Instagram Brings Hide Like Count Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X