డేటింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఫేస్‌బుక్

|

ఫేస్‌బుక్ సంస్థ ఇప్పుడు తాజాగా డేటింగ్ సర్వీస్ ను ప్రకటించింది అది కూడా యూఎస్ లాంటి పెద్ద నగరంలో. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఇప్పుడు ఫేస్‌బుక్ డేటింగ్‌ సర్వీస్ ను ఎంచుకుని డేటింగ్ ప్రొఫైల్‌ను కొత్తగా క్రీయేట్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ మీ యొక్క మెయిన్ ప్రొఫైల్ నుండి వేరుగా ఉంటుంది. ఇందులో నమోదు చేసుకోవడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్

ఫేస్‌బుక్ ప్రజలకు వారి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను నేరుగా వారి డేటింగ్ ప్రొఫైల్‌లో అనుసంధానించే సామర్థ్యాన్ని కూడా ఇస్తోంది. ఇది ఫేస్‌బుక్ స్నేహితులతో పాటు ఇన్‌స్టాగ్రామ్ అనుచరులను వారి సీక్రెట్ క్రష్ జాబితాలో చేర్చే సామర్థ్యాన్ని ఇస్తుంది. "ఈ సంవత్సరం చివరినాటికి మీ డేటింగ్ ప్రొఫైల్‌కు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లను జోడించే వెసులుబాటు కల్పిస్తాము" అని ఫేస్‌బుక్ డేటింగ్ ప్రొడక్ట్ మేనేజర్ నాథన్ షార్ప్ అన్నారు.

ఫేస్‌బుక్ డేటింగ్ లాంచ్

ఫేస్‌బుక్ డేటింగ్ లాంచ్

ఫేస్‌బుక్ డేటింగ్ లో మీకు ఎవరి మీద అయిన ఆసక్తి ఉంటే కనుక నేరుగా వారి ప్రొఫైల్‌కు కామెంట్ పంపవచ్చు. మీ యొక్క ఆసక్తి గురించి వారికి తెలియజేయడానికి మీరు లైక్ బటన్‌ను కూడా నొక్కవచ్చు. మీరు సీక్రెట్ క్రష్ ఫీచర్ ను ఉపయోగించాలని ఎంచుకుంటే తప్ప ఫేస్‌బుక్ డేటింగ్ మీకు స్నేహితులకు చూపించదు. ప్రతి ఒక్కరూ తమ సీక్రెట్ క్రష్ జాబితాలో మరొకరిని జోడించినట్లయితే మాత్రమే ఇద్దరికీ తెలియజేయబడుతుంది.

ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీస్

డేటింగ్ కార్యకలాపాలన్నీ ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీస్ లోనే ఉంటాయని ఫేస్‌బుక్ పేర్కొంది. ఇది మిగిలిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌తో భాగస్వామ్యం చేయబడదు. ఈ డేటింగ్ సర్వీస్ ను "సురక్షితమైన మరియు ఆప్ట్-ఇన్" గా నిర్మించినట్లు కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్ డేటింగ్ సీక్రెట్ క్రష్ ఫీచర్

ఫేస్‌బుక్ డేటింగ్ సీక్రెట్ క్రష్ ఫీచర్

సీక్రెట్ క్రష్ ఫీచర్ మీ జాబితాలో మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తులతో మ్యాచ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకరు తమ ఫేస్‌బుక్ స్నేహితులు లేదా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో తొమ్మిది మందిని ఎంచుకోవచ్చు. మీ క్రష్ ఫేస్‌బుక్ డేటింగ్‌లోకి ఎవరైనా ప్రవేశించినట్లయితే వారిపై క్రష్ ఉందని వారికి నోటిఫికేషన్ వస్తుంది అని ఫేస్‌బుక్ వివరించింది.

సీక్రెట్ క్రష్

సీక్రెట్ క్రష్ జాబితాలో ఇద్దరూ ఒకరినొకరు ఆడ్ చేసుకుంటే కనుక ఫేస్‌బుక్ మీకు మరియు మీ క్రష్‌కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఫేస్‌బుక్ డేటింగ్ వినియోగదారులు వారి రాబోయే తేదీ లేదా వారు ప్రస్తుతం వున్న స్థానం యొక్క వివరాలను మెసెంజర్ ద్వారా వారు విశ్వసించే వారితో పంచుకోవడాన్ని కూడా అనుమతిస్తుంది.

19 దేశాలలో

యుఎస్‌తో పాటు ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీస్ ప్రస్తుతం ఇతర 19 దేశాలలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఫేస్‌బుక్ డేటింగ్ లాంచ్‌ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇది 2020 ప్రారంభంలో ఐరోపాలో కూడా మొదలు కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Facebook Introduced Dating service : Find The Full Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X